Read News in Telugu Language
adsdaksha

సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు నడపనున్న టిఎస్ ఆర్టీసి..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 6

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులు నడపనున్నామని, ఆన్ లైన్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు.

Read also: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

మహిళలకు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినందున, ప్రత్యేక బస్సులకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు.

ఈ స్పెషల్ బస్సులను, రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో నడుపుతామని సజ్జనార్ తెలి పారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Hospital

ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, అరాంఘర్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

Read also: జాయ్ స్మైల్స్ ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదగాలి .. ట్రస్టు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జారె..

ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకొని, బస్టాప్ ల వద్ద తాగు నీరు, కూర్చీలు, మొబైల్ టాయిలెట్స్, టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ స్టాప్ ల వద్ద ఇద్దరు డీవీఎం స్థాయి అధికారులను నియమించనున్నామని అన్నారు. వారు ప్రత్యేక బస్సుల గురించి సమాచారం ఇస్తారని పేర్కొన్నారు.

టికెట్ల ధరలు కూడా పెంచటం లేదని ఈ సందర్భంగా తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు టీఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.