Read News in Telugu Language
adsdaksha

గ్రూప్ 4 ఫలితాలు వచ్చేశాయ్.. 7,26,837 మంది అర్హత సాధించినట్లు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 9

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు ( tspsc Group 4 Results) రిలీజ్ అయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( tspsc ) శుక్రవారం రాత్రి వెల్లడించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్ సైట్లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. ధృవపత్రాల వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

Hospital

read also : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం ..

రాష్ట్రంలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా 80 శాతం మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, జనరల్ ర్యాకింగ్ లిస్ట్‌లో 7,26,837 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల ర్యాంకుల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ (https://www.tspsc.gov.in/)లో పొందుపరిచింది.

Leave A Reply

Your email address will not be published.