Read News in Telugu Language
adsdaksha

tspsc : గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు .. ఈనెల 16 వరకు పెంచిన టీఎస్పీఎస్సీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 15

గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీఎస్సీ గుడ్‌న్యూస్ చెప్పింది. దరఖాస్తులకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న టీఎస్‌పీఎస్సీ ( tspsc ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Hospital

read also :పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గింపు

ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం ముగిసింది. అయితే చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. గడువు పొడగించాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో 16వ తారీఖు వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిర్ణయం పట్ల గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.