Read News in Telugu Language
adsdaksha

న్యాయ్ పత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో..విడుదల చేసిన రాహుల్ గాంధీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 6

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, దీపదాస్ మున్షీ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు తుక్కుగూడ ( tukkuguda ) వేదికగా కాంగ్రెస్ శంఖారావాన్ని పూరించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ( congress ) జాతీయ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) రిలీజ్ చేశారు. న్యాయ్ పత్రం ( nyay pathra ) పేరుతో 5 హామీలను ఆయన విడుదల చేశారు. రాహుల్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు 23 ప్రత్యేక హామీలను సభలో ప్రకటించారు.

Read also: పార్టీ పేరు మార్పు కలిసిరాలేదు .. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి..

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి నాలుగు కొత్త సైనిక్ పాఠశాలలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ కారిడార్, పాలమూరుకు జాతీయ హోదా, మేడారం జాతర జాతీయ పండుగగా గుర్తింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల అమలును నిర్ధారించడం, ఆంధ్రప్రదేశ్‌ ( andhrapradesh ) లో విలీనమైన 5గ్రామాలు మళ్లీ తెలంగాణ ( Telangana ) లో విలీనం చేయడం, తెలంగాణలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు అనే హామీలను రాహుల్ అనౌన్స్ చేశారు.

Hospital

Read also: సింగాపురం ఇందిరను కలిసిన కడియం కావ్య.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ అన్నారు. మహిళలకు ఏటా రూ. లక్ష నేరుగా బ్యాంకులో జమచేస్తాం. ఉపాధి హామీ కూలీకి కనీస వేతనం రూ.400కి పెంచుతాం. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తాం. రైతు రుణమాఫీ ( raithu runamafi ) చేస్తాం అని రాహుల్ ప్రకటించారు.

Read also: వడ్డీ రేట్లు కొనసాగింపు .. ఏడోసారి యథాతథం చేసిన ఆర్బీఐ..

ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ. లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండబోదని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడ రిలీజ్ చేశానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. రూ.500లకే గ్యాస్, 200యూనిట్ల కరెంట్ ఫ్రీ, 10లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ( Rajeev Arogyasri ) వంటి హామీలు తెలంగాణలో నెరవేర్చినట్లే.. జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.