Read News in Telugu Language
adsdaksha

7న ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక : తుంబూరు దయాకర్ రెడ్డి..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 5

సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఈ నెల 7వ తేదీన మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ( tumburu dayakar reddy ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ( khammam ) పార్లమెంట్ కాంగ్రెస్ ( congress ) పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రామసహాయం రఘు రాం రెడ్డి ( ramasahayam raghuramreddy ) కి వియ్యంకుడు కావడంతో ఆయన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు వెంకటేశ్ వస్తున్నట్లు తెలిపారు.

read also : భారత రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ మనకొద్దు : సత్తుపల్లి రోడ్ షోలో మంత్రి పొంగులేటి ..

Hospital

సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షో లో వెంకటేశ్ పాల్గొంటారని దయాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం రాత్రి 8గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్ లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెంకటేష్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై వెంకటేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.