Read News in Telugu Language
adsdaksha

ఇళ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం సానుకూలం.. నిమ్మరాజు కు కమిషనర్ హామీ..

దక్ష న్యూస్, దక్ష న్యూస్, విజయవాడ: డిసెంబర్ 18

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రస్తుతం అక్రిడేషన్ కలిగిన వారందరూ ఇళ్ల స్థలాల దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ( andhrapradesh ) రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ( tumma vijay kumar reddy ) అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల ( journalist ) పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సానుభూతి ఉందని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్క అక్రిడిటేడెడ్  జర్నలిస్టుకు సొంత స్థలం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అయితే నిబంధనల మేరకు ప్రస్తుతం అక్రిడిటేషన్ కలిగిన వారందరూ ఇళ్ల స్థలాకై దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.

సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్రభూమి దినపత్రిక సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా మూసివేయ బడిన నేపథ్యంలో ఆ పత్రికలో పనిచేసిన జర్నలిస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్ర భూమిలో 30 ఏళ్ల పాటు బ్యూరో చీఫ్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు సోమవారం కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని సోమవారం ఓ జర్నలిస్టు బృందంతో కలిసి వినతిపత్రం సమర్పించారు.

read also : తెలంగాణ రాష్ట్రం నుండి సోనియా గాంధీ పోటీ చేయాలి: టి-కాంగ్రెస్…

Hospital

ఆంధ్రభూమిలో రెండు దశాబ్దాలుగా పనిచేసి గతంలో అక్రిడేషన్ కలిగిన వారు కూడా వారి అనుభవం నిర్ధారించే ధృవపత్రంతో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిమ్మరాజు కమిషనర్ ను ఈ సందర్భంగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ 58 సంవత్సరాలు దాటిన వారందరూ వెటరన్ జర్నలిస్టులుగా దరఖాస్తు చేసుకుని అక్రిడేషన్ పొందవచ్చని లేదా ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా కూడా పొందవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఇంటి స్థలం విషయంలో కొందరు పనిగట్టుకుని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అది సరికాదని అన్నారు.

read also : మేడిగడ్డపై పూర్తి వివరాలు అందజేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ..

ప్రభుత్వం మాత్రం జర్నలిస్టు అక్రిడిటేషన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో సీనియర్ జర్నలిస్టు బొంత విలియం పాల్, బాణావతి, పరశ్యాం తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.