Read News in Telugu Language
adsdaksha

అందుబాటులో లేనివారు ఆందోళన చెందవద్దు.. 6 లోపు దరఖాస్తులు పంచాయితీ కార్యాలయాల్లో సమర్పించండి : మంత్రి తుమ్మల

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 5

ప్రజల వద్దకు పాలన తేవాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపాలన ( praja palana ) కార్యక్రమం చేపట్టి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కార్యాచరణ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి ( minister ) తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) తెలిపారు. శుక్రవారం ఖమ్మం ( khammam ) నగరంలోని 54వ డివిజన్, రఘునాథపాలెం మండలం సూర్య తాండ, రాంక్యా తాండ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం ( abhaya hastham ) క్రింద ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించేందుకు జిల్లా, మండల ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజల మధ్యకే వచ్చిందని అన్నారు.

read also : ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు…

డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి, దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రజాపాలన సభ రోజున వీలుకాని వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తమ దరఖాస్తును శనివారం లోపు తమ తమ గ్రామపంచాయితి కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో అధికారులకు అందజేయాలని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీలకు మంత్రుల ప్రమాణస్వీకారం జరిగిన రెండు గంటల్లోనే కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, చట్టబద్దత కల్పించినట్లు మంత్రి గుర్తు చేశారు. రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే అందించి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో, గుర్తించబడిన కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్య చికిత్స కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 5 లక్షల పరిమితిని, పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు.

Hospital

read also : ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ సంక్రాంతిలోపే పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

మిగతా పథకాల కోసం మీరు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటింటికి వస్తాయని, ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని తుమ్మల అన్నారు. ప్రభుత్వ ఫలాలు అందరికి అందుతాయని అన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు సమర్పించేందుకు వచ్చిన ప్రజలతో, ఏయే పథకాల కొరకు దరఖాస్తు చేసింది అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాల అమలు చేస్తుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్ కార్పొరేటర్ మంజుల నరేందర్, కార్పొరేటర్ కమర్తపు మురళి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.