Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం లో మార్కెటింగ్ శాఖా మంత్రి విస్తృత పర్యటన..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 11

రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) గురువారం ఖమ్మం ( khammam ) నగరంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత స్థానిక త్రీ టౌన్ ఏరియా 32 వ డివిజన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుగ్గల ఈశ్వర లింగం ఇంట్లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మరో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి.వి.అప్పారావు, 35 వ డివిజన్ మహేశ్వరి జ్యూయలరీస్ అధినేత అర్వపల్లి అశోక్, 36 వ డివిజన్లో మాడిశెట్టి హనుమంతురావు, 32 వ డివిజన్లో పాయల నాగేశ్వరరావు, 33 డివిజన్లో యస్. కే యాకూబ్, లతీఫ్, 31 వ డివిజన్లో వల్లెపు ఉపేందర్ (లక్కీ) గృహాల్లో జరిగిన తేనీటి విందుల్లో పాల్గొన్నారు.

Read also: లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించిన మాజీమంత్రి చిన్నారెడ్డి..

ఖమ్మం నగరం లోని మూడు బొమ్మల సెంటర్లో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఒడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా మంత్రి తుమ్మల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే కాసేపు డివిజన్ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అక్కడి సమస్యలన్నీటినీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

Hospital

Read also: గాంధీజీ పాఠశాలలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ..

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మలీదు జగన్, కొప్పెర ఉపేందర్, మిక్కిలి నేని నరేందర్, నాగండ్ల దీపక్ చౌదరి, త్రీ టౌన్ నాయకులు తల్లాడ రమేష్, కల్వకుంట్ల గోపాల్,
కొదుమూరి మధు, బాణాల లక్ష్మణ్, బొమ్మ ఉదయ్, గజ్జల వెంకన్న, వెన్న పండు, నల్లమల ఆనంద్, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.