Read News in Telugu Language
adsdaksha

అధికారులపై మంత్రి ఆగ్రహం.. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని ఆర్డర్స్..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 12

ఖమ్మం వ్యవసాయ మార్కట్ పై పర్యవేక్షణ కరవైందని మంత్రి తుమ్మల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మం ( khammam ) మిర్చి మార్కెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పంటల ధరను గణనీయంగా తగ్గిస్తున్నారంటూ రైతులు మంత్రి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. అందుకు స్పందించిన మంత్రి తుమ్మల గిట్టుబాటు ధరలకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు సూచించారు.

read also : భద్రకాళీ సమేత వీరభద్రుడికి వెండి నాగాభరణం సమర్పించిన తాళ్లూరి జయశేఖర్ దంపతులు..

Hospital

అనంతరం మార్కెట్‌లో అవకతవకలపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల మార్కెట్ పై పర్యవేక్షణ కరవైందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని హెచ్చరించారు. అంతేకాదు.. కొనుగోలు చేసిన మిర్చి పైసలను అన్నదాతలకు వెంటనే చెల్లింపులు జరపాలని సూచించారు. ఏ ఒక్క రైతు మోసపోవడానికి వీల్లేదన్నారు. రైతులు మోసపోకుండా… ఇతర శాఖలను సమన్వయం చేసుకుని వారికి న్యాయం చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.

read also : స్వామి వివేకానంద జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి ..

Leave A Reply

Your email address will not be published.