Read News in Telugu Language
adsdaksha

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుసందానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : తుమ్మల

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 27

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. శనివారం మంత్రి రఘునాథపాలెం ( raghunadhapalem ) మండలం మంచుకొండ గ్రామంలో రూ.20 లక్షల అంచనావ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.

read also :వందేభారత్ ఆడియో ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర..

Hospital

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కార్పోరేటు స్థాయిలో వైద్య సేవంలందిస్తున్న జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుసందానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు నిర్మించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

read also : నేటి యువతరం మెచ్చే బైక్ జావా 350 : తుమ్మల యుగంధర్

గ్రామ సర్పంచ్‌ వాంకుడోతు విజయ, రఘునాథపాలెం తహశీల్దారు విల్సన్‌, ఎంపిడి.ఓ రామకృష్ణ, మండల విద్యాధికారి శ్రీనివాస్‌, మెడికల్‌ అఫీసర్‌ బాలకృష్ణ, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ నిలోహణ, వ్యవసాయ శాఖ ఏడి శ్రీనివాస్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇ.ఇ తాణాజి, పంచాయితీరాజ్‌ డి.ఇ ఆదిత్యనాధ్‌, ఆర్‌అండ్‌బి ఏఇ. విశ్వనాధ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.