Read News in Telugu Language
adsdaksha

నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల

దక్ష న్యూస్, ఖమ్మం: మార్చి 20

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని ఒక ప్రకటనలో వివరించారు.

Read also: ఎన్నికల సమయంలో ‘ఉచిత హామీలు’ వద్దు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం ..

Hospital

పదేళ్లుగా రైతులను చూసుకోని వారు, ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడం తగదని తుమ్మల అన్నారు. పదేళ్లలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వని వారు నేడు విచిత్రంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

Read also: pmegp : పీఎంఇజిపి స్కీమ్ తో యువత కలలు సాకారం..

ఎన్నికల ముందు కేవలం రూ.150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని ఆరోపించారు. మూడోసారి కూడా కనీసం పంట నష్టం అంచనా వేయలేదు. గత మే వరకు రైతుబంధు నిధులు జమ చేసిన నేతలు నేడు మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.