Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు… ఒక్క సీటు కూడా మీకు రానివ్వం..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 4

– ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి తుమ్మల..

పది సంవత్సరాల కాలంలో రైతు రుణమాఫీ చేయకుండా బీఆర్ఎస్ ( brs ) వాళ్ళు ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ. మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) ధ్వజమెత్తారు. గురువారం వీడిఓస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఖమ్మం ( khammam ) నియోజకవర్గ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొని మాట్లాడారు. అవినీతి, కబ్జాలతో, పోలీసులతో తిరిగి అధికారంలోకి వస్తామన్న దురుద్దేశ్యంతో బిఆర్ఎస్ నాయకులు అధికారమదంతో కార్యకర్తలను, ప్రజలను హింసించి, భయపెట్టారన్నారు. కానీ ప్రజల శక్తిసామర్ధ్యాల ముందు, పట్టుదల ముందు వారి ఆశలు పటాపంచలు అయ్యాయని అన్నారు.

సోనియాగాంధీ ఇచ్చిన 6గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. వాళ్ళు చేసిన అప్పులు, దానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుందని, అయినా హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. మా 120 రోజుల పాలనను చూసిదేశమంతా తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అందుకని మనం ఇచ్చిన గ్యారెంటీలనే దేశమంతా అమలు చేసేందుకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకాగాంధీలు శనివారం తుక్కుగూడలోని రాజీవ్ ప్రాంగణానికి వస్తున్నారని తెలిపారు.

Hospital

read also : మున్సిపల్ శాఖపై కేటిఆర్ ఫైర్.. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం..

మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా పరిపాలనను అందిస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుకుంటూనే సంక్షేమపాలనను అందిస్తామన్నారు. అన్నీచోట్ల పంటలు కోతకు వచ్చాయని, ఖమ్మం జిల్లాలో నీరులేక పంట ఎక్కడా ఎండిపోలేదన్నారు. భూగర్భజలాలపైనే రైతులు ఆధారపడుతున్నారని ఒక్క సెకన్ కూడా కరెంట్ పోకుండా రోజుకు రూ.50కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రంలో కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లకోసం బీఆర్ఎస్ వాళ్ళు నీళ్ళ రాజకీయం చేస్తున్నారని తుమ్మల విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్దిచెపితే అది సరిపోలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి వస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఒక్క సీటు కూడా మీకు రానివ్వమని బీఆర్ఎస్ నేతలకు మంత్రి తుమ్మల సవాల్ విసిరారు.

read also : పువ్వాడ ఉదయ నగర్ సర్వే నెంబర్ 192 లో భూదందాలు : డాక్టర్ కె.వి. కృష్ణారావు..

తుక్కుగూడ జనజాతర సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావీద్, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు దొబ్బల సౌజన్య. కార్పొరేటర్లు లకావత్ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, సాధు రమేష్రెడ్డి, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, మళ్లీ జగన్. మళ్లీ వెంకటేశ్వర్లు. గజ్జల లక్ష్మి. పాకాల పాటి విజయనిర్మల. లకావత్ సైదులు. ఆళ్ళ నిరీషారెడ్డి. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.