Read News in Telugu Language
adsdaksha

ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లో దూసుకెళ్తున్న తుమ్మల..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 4

స్థానిక సమస్యల పరిష్కారానికి తుమ్మల హామీ..

తెలంగాణ ( telangana ) రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆర్టీసీ( rtc ) కార్మికులు 48 రోజులు నిరవధిక సమ్మె చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. ఖమ్మం ( khammam ) పట్టణంలోని 58వ డివిజన్ బీసీ కాలనీ లో స్థానిక నాయకులు ఆంగోత్. లక్ష్మణ్ నాయక్, లక్కిరాజు. రామకృష్ణారావు, ఎల్ ఆర్ కే రావు, నరసింహారావు తో పాటు సీనియర్ నాయకులు కలిసి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సు( rtc bus ) పేదవాడి వాహనం అన్నారు. రోజుకొకరకమైన జీవోలు ప్రకటించి కార్మికులను ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమం కూడా వచ్చే ప్రభుత్వం తీసుకోదని తుమ్మల అన్నారు.

read also : 23 రోజులే మిగిలి ఉంది.. ఎన్నికలపై దృష్టిపెట్టండి..

Hospital

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు, ప్రయాణికులకు ఉపకరించే కార్యక్రమాలు చేపడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని. లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మానుకొండ రాధా కిషోర్ ,సాదు. రమేష్ రెడ్డి, శెట్టి. రంగారావు, తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం 58 వ డివిజన్ బీసీ కాలనీలో స్థానిక నాయకులు శెట్టి రంగారావు, బట్టు గోపి నాయక్ , శేఖర్, నరసింహారావు, పర్వీన్, రజిని, రామాచారి తో పాటు స్థానిక సీనియర్ నేతలు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనలోపాల్గొన్న
మాజీ మంత్రి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల. నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ,
..డంపింగ్ యార్డ్ మార్చడానికి తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడే జీవో తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ జీవో ని నేటి ప్రభుత్వం తుంగలో తొక్కి స్థానిక ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఈనెల 30 తర్వాత మన ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

read aalso : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నామినేషన్..

ఖమ్మం పట్టణంలోని 12వ డివిజన్లో లక్ష్మి గణేష్ రెసిడెన్స్ వాసులు దండారు ప్రసాద్, శివ ,స్వర్ణ. నరసింహారావు, కూచిపూడి జయ, దీర్శాల హనుమంతరావు, స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.