Read News in Telugu Language
adsdaksha

తుమ్మలపై దాడి కేసులో నిజాలను నిగ్గు తేల్చాలి.. ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 20

మంత్రి తుమ్మల నాగేశ్వరావు హత్యకు కుట్ర జరిగినట్లు వచ్చిన వార్త కథనంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు, అనుచరులు డిమాండ్ చేస్తూ శనివారం ఖమ్మం ( khammam ) పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ కి వినతి పత్రం సమర్పించారు. గత ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తుమ్మల ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రేవంత్ రెడ్డి ( revanth reddy ) క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) పై ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద హత్య చేయటానికి ప్రయత్నించినట్లు మీడియాలో వార్తలు రావడంపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఈ కుట్ర వెనుక ఓ మాజీ పోలీసు అధికారి, ఓ వైద్యుడు, హోంగార్డులు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీనిలో మాజీ మంత్రితో దగ్గర సంబంధాలు ఉన్న ఇద్దరు మాజీ మీడియా ప్రతినిధులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

read also : టచ్ చేసి చూడు మాడి మసై పోతావ్.. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..

Hospital

మాజీమంత్రి అనుచరులుగా చలామణి అవుతూ ఫైరవీల దందా నడిపిన కొందరు హత్యా పథకానికి సూత్రధారుగా చెబుతున్న పోలీసు అధికారి, వైద్యుడికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారని చెబుతున్నారు. ఇన్ని రోజులు చూసిన ఈ కుట్ర కోణంపై తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ.. ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు స్పందించారు. ఈ కుట్ర వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు ఆ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

read also : salaar : చిన్న మెసేజ్ తో సలార్ లో ప్రభాస్ నడిపిన బైక్ ని ఇలా గెలుచుకోవచ్చు..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి అరాచకాలు జరిగాయని పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మీడియా ముఖంగా ఖండించారు. విచారణ జరపాలని పోలీసు అధికారులను కోరారు. ‌ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి విజ్ఞప్తి చేశారు.

పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ కి వినతి పత్రం సమర్పించిన వారిలో కార్పొరేటర్ మిక్కిలినేని నరేందర్,పత్తి శ్రీనివాస్,చండ్ర రాంబాబు,నల్లమల ఆనంద్,నల్లమల వేణు చౌదరి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.