Read News in Telugu Language
adsdaksha

ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం.. రైతులు అధైర్య పడొద్దు : ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 8

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రైతులు అధైర్య పడవద్దని ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) భరోసానిచ్చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బుధవారం కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్న మొన్న కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఇకపై రానున్న రోజుల్లో రైతుల పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుందని, రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతులకు ఇచ్చిన హామీ రైతు భరోసా కింద 15000 ఇస్తామని అన్నారు.

అనంతరం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉపయోగపడే ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందని ఉచిత విద్యుత్, ఎన్నో సంక్షేమ పథకాలను రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Hospital

read also : కుల గణన చెయ్యకపోవడం వెనుక కాంగ్రెస్, బిజెపి కుట్ర దాగి ఉంది : కె.పర్వతాలు..

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలుపరిచే బాధ్యత తీసుకొన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. రాజకీయపరంగా ఖమ్మం జిల్లా ఎంతో చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అని మరో మారు నిరూపించాలని సూచించారు.

read also : తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం.. కై కొండాయిగూడెం ఆత్మీయ సమ్మేళనంలో రఘురాం రెడ్డి..

కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,
నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ రాయల నాగేశ్వరరావు, పి సి సి సభ్యులు జిల్లా ఓబిసీ సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజి జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నల్లమల వేంకటేశ్వర్లు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు దాసరి దానియేలు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, రాష్ట్ర ఓబిసీ సెల్ ఉపాద్యక్షులు వడ్డెబోయిన నరసింహారావు,మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, రావూరి సైదుబాబు, మాజి మహిళా కాంగ్రెస్ అద్యక్షులు పోరిక లక్ష్మీ భాయి, గుత్తా ద్రౌపది, బాణోత్ వినోద, మందపల్లి నాగమణి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు కొంట్టేముక్కల నాగేశ్వరరావు, కోటేరు నర్సిరెడ్డి, జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన జిల్లా కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గం,మండల కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.