Read News in Telugu Language
adsdaksha

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ.. .

దక్ష న్యూస్, ఖమ్మం : మే 14

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలిచిన ప్రజానికానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం ఒక లేఖను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలిచి సోనియమ్మ, రాహుల్ గాంధీ…సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం పై విశ్వాసంతో.. తెలంగాణ ప్రగతి కోసం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలిచిన ప్రజానీకానికి.. రైతాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ ను విడుదల చేస్తున్నానన్నారు.

లేఖ సారాంశం..

ప్రియమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలారా నాలుగు దశాబ్దాలుగా నా రాజకీయ జీవితంలో వెన్నంటి ఉండి రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా నా నిర్ణయం కు అండగా ఉంటూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం భాగస్వాములు గా ఉంటున్నారు. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో సోనియమ్మ రాహుల్ గాంధీ…రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజార్టీ తో గెలిపించి ప్రజా తీర్పు ఇచ్చారు.

ఐదు నెలల కాలంలో ఆరు గ్యారంటీ పథకాలు అమలు అవుతున్న తీరు.. ప్రజా సంక్షేమ పాలన.. ప్రజా పాలన చూసిన మీరు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో విశ్వాసం తో మద్దతుగా నిలిచిన మీకు కృతజ్ఞత లు తెలుపుతున్నాను.

ఈ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నప్పుడల్లా గత నలభై ఏళ్ల నా రాజకీయ జీవితంలో నేను చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయో చూశాను. ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ప్రజా క్షేత్రంలో తెలుసుకున్నాను. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పూజ్యులు ఎన్టీఆర్ గారి ఆశీర్వాదం తో మొదలైన నా రాజకీయ ప్రస్థానంలో …..నలభై ఏళ్లుగా నా ఆశయం నా సంకల్పం గోదావరి జలాల తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ను సస్య శ్యామలం చేయడమే.

నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్….చంద్రబాబు, కేసీఆర్….ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న నేను ఈ టర్మ్ లో సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో నా రాజకీయ లక్ష్యం గా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయాలని విశ్వాసం తో ఉన్నాను. నేను గతంలో చేపట్టిన అభివ్రుద్ది పనులు వాటి ఫలితాల గూర్చి ప్రజలు చెబుతుంటే పదవులు శాశ్వతం కాదు చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయనీ రుజువైంది. గోదావరి జలాల తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలంగా మార్చే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం
…..ఈ వానాకాలం సీజన్ లోనే గోదావరి జలాలను వైరా రిజర్వాయర్ కు తరలించే లింక్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం …..యావత్ తెలంగాణ కే ఉమ్మడి ఖమ్మం జిల్లా ను పామాయిల్ హబ్ గా మార్చడం …..పామాయిల్ సాగుతో రైతును రాజుగా మార్చేలా కాంగ్రెస్ పాలన ..రైతులకు మేలు చేసేందుకు బుగ్గపాడు పుడ్ పార్క్ పూర్తి చేసి ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తాం. పామాయిల్ రైతులకు అవసరం ఉన్న చోట పామాయిల్ ఫ్యాక్టరీ లు ఏర్పాటు చేస్తాం. జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలో సాగుతుంది…..అమరావతి టూ జగదల్ పూర్ సూర్యాపేట టూ రాజమండ్రి.. కోదాడ టూ కురవి, కొత్తగూడెం టూ హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుదిక్కులా ప్రజానీకం ప్రగతి పథంలో విశ్వాసం తో ఉన్నారు.

Hospital

గోదావరి జలగండం లేకుండా గతం లో నిర్మాణం చేసిన కరకట్ట భద్రాద్రి కి శ్రీ రామ రక్ష గా నిలిస్తే, రేవంత్ రెడ్డి సర్కార్ కరకట్ట విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయడం ఈ వానాకాలం నాటికి కరకట్ట విస్తరణ పనులు పూర్తి చేయడం అభినందనీయం. ఖమ్మం నగరానికి మున్నేరు వరద గండం లేకుండా రేవంత్ రెడ్డి సర్కార్ లో రక్షణ గోడల నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి.

మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ గా ప్రచారం లో నా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు గతంలో నేను చేపట్టిన అభివృద్ధి పనులు పట్ల ప్రజలు చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపినపుడు ఓ నాయకుడుగా ప్రజా జీవితంలో ఎంతో సంతృప్తి లభించింది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రజా సేవ చేసే భాగ్యం దక్కింది. మంత్రి పదవంటే హంగామా ఆర్భాటం కోసం కాదు ప్రజా జీవితంలో మార్పు వచ్చేలా ఏజెన్సీ ప్రాంత వాసులను నాగరిక సమాజం వైపు అడుగులు వేసేలా నలభై ఏళ్ల నా రాజకీయ జీవితం లో నా ఆశయం నెరవేరిన సంతోషం కనిపించింది.

read also : ఓటు హక్కు వినియోగించుకున్న పొంగులేటి బ్రదర్స్.. మాదాపురంలో ఓటేసిన రఘురాం రెడ్డి..

భద్రాచలం డివిజన్ లో కూనవరం….తాలిపేరు… వెంకటాపురం హై లెవల్ బ్రిడ్జి ల నిర్మాణం….జాతీయ రహదారుల నిర్మాణం తో పల్లెలు ప్రగతి బాట పట్టగా మానవ వికాసం వెల్లివిరిసింది. గ్రామాలకు రహదారులతో విద్యా, వైద్యం, అగ్రి కల్చర్, మార్కెటింగ్…..రిటైల్ మార్కెట్ అందుబాటు లోకి వచ్చింది. గుండాల ఏజెన్సీ లో గతం లో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయో ఏ విధంగా తమ జీవితాల్లో మార్పు వచ్చింది ఆదివాసీ గిరిజనులు నన్ను కలిసి వారి సంతోషం వ్యక్తం చేస్తుంటే నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. నా రాజకీయ లక్ష్యం నెరవేరిన సంతోషం నన్ను తడిమింది. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నాగరిక సమాజం కు దూరంగా ఉన్న ఆదివాసీలు కొండ రెడ్లు జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉంది.

పోడు వ్యవసాయం చేసే రైతులకు కష్టాలు లేకుండా కాంగ్రెస్ పాలనలో కల్పించిన సౌకర్యాలు, ఆదివాసీ గిరిజన మైనార్టీ ల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి పాలనలో ఆరు గ్యారంటీ పథకాల వెలుగులు నింపే కార్యక్రమాలు ఉత్సాహాన్నిచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ లోనే అభివృద్ధిలో తనదైన ముద్ర వేసేలా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం తో పార్లమెంట్ ఎన్నికల్లో అండగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ

మీ
తుమ్మల…….
వ్యవసాయ శాఖ మంత్రి

Leave A Reply

Your email address will not be published.