Read News in Telugu Language
adsdaksha

సెల్ ఫోన్ చూసే ప్రతీ ఒక్కరికీ మల్లన్న పోరాటం తెలుసు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 21

మల్లన్న ఘాత ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదని చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆయన పోరాటం తెలుసని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలో లోని ఎస్ ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా తీన్మార్ మల్లన్న ( theenmar mallanna) చేస్తున్న పోరాటం ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు. ఏదో టెక్నికల్ సమస్య వల్ల ఆయన అప్పుడు ఓడిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయనను ఆ పదవి వరించబోతోంది అన్నారు.

Read also: ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టండి : పాలేరు నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో పొంగులేటి..

తీన్మార్ మల్లన్న అందరివాడు అందరికీ కావలసిన వాడని మంత్రి తుమ్మల అన్నారు. ఆయన ప్రచారానికి తిరగకపోయినా గెలుస్తారని కానీ స్వయంగా అందరినీ కలిసి ఓటు అభ్యర్దించడం బాధ్యతగా భావించి మన మధ్యకు వచ్చారన్నారు. తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉన్నా ఆయన గొంతు మూగబోదని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. పట్టభద్రుల కోసం విద్యకోసం వైద్యం కోసం మల్లన్న పడ్డ తపన, కష్టం అందరికీ తెలుసన్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చనువు తో అన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.

Read also: 36 మెట్రిక్ టన్నుల ధాన్యం ను ఇప్పటికే కొనుగోలు చేసాం : సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

Hospital

రేపు కౌన్సిల్ లో మీ మనిషిగా మీ గొంతుగా మీ గళాన్ని వినిపించే తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని తుమ్మల పట్టభద్రులను కోరారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఒక మంచి మనిషిని సమాజానికి అందించిన ఘనత మీకు దక్కుతుందన్నారు.

అన్నిరంగాల్లో కష్టాలు ఉన్నాయని మంత్రి తుమ్మల అన్నారు. అయినా మీరిచ్చిన సపోర్ట్, నైతికత తో అన్ని రంగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు వెళ్తున్నామన్నారు. ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయంటే ఎలా పడుతున్నాయో అందరికీ ఆశ్చర్యం గానే ఉందన్నారు. మల్లన్న చెప్పినట్లు తెలంగాణ ను అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిన గత పాలకులు చెయ్యాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రజలను మోసం చెయ్యడానికి బయల్దేరారన్నారు.

బ్యాలెట్ పేపర్లో రాయాల్సింది జై మల్లన్న అనికాదు…

పోయినసారి ఎలక్షన్లో మల్లన్న ఓడిపోయింది ఓట్లు పడక కాదని మంత్రి తుమ్మల అన్నారు. చాలా మంది ఓటు వేయాల్సినచోట జై మల్లన్న అని రాశారన్నారు. అలా ఏమీ రాయాల్సిన అవసరం లేదని రెండో నంబర్ ముందు 1 అంకె వెయ్యాలన్నారు. మల్లన్న మీద అభిమానంతో నినాదాలు రాయడం లాంటి పనులు చేయవద్దని వాళ్ళు ఇచ్చిన పెన్నుతో రెండో నంబర్ ఎదురుగా 1 అని అంకె వేస్తే చాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ గత బిఆర్ ఎస్ నిరంకుశ నియంతృత్వ పాలనకు విసిగి పోయిన ప్రజలే కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టారన్నారు. ఏ పార్టీ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాడే నన్ను మీరంతా గుండెల్లో పెట్టుకొని చూశారని అన్నారు. ఆనాడు మోసంతో నా గెలుపును అప్పటి అధికార పార్టీ నాయకులు ఆపగలిగినా ఇప్పుడు మీ అందరి ఆశీస్సులతో తనను చట్టసభలకు పంపాలన్నారు. మీ ఓటు వృధా కానివ్వనని మాటిస్తున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.