Read News in Telugu Language
adsdaksha

ట్యాంకర్లు ట్యాప్ లు అని మాట్లాడే ఆయన నేను వాటర్ ఫిల్టర్లు కట్టిచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 5

– పువ్వాడ కు తుమ్మల సూటి ప్రశ్న..

ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు.
ఇలాంటి అరాచకాలను ప్రోత్సాహించిన నాయకులెవరూ మనుగడ సాగించినట్లు చరిత్ర లో లేదన్నారు. ఖమ్మం నగరంలోని 23 వ డివిజన్ హరివిల్లు అపార్ట్మెంట్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Hospital

Read also : ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లో దూసుకెళ్తున్న తుమ్మల..

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లు అబద్ధపు ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారారన్నారు.
ఎవరి చరిత్ర ఏమిటనేది ఖమ్మం ప్రజలకు తెలుసని,అతనేదో నా కాలంలో ట్యాంకులు ఆయన కాలంలో ట్యాపులు అంటూ చెప్పుకుంటున్నారు అసలు ఆయన తండ్రి కాలంలోనే ట్యాంకులతో నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండేది, నేను ఖమ్మం ఎమ్మెల్యే అయ్యాకే దానవాయి గూడెం, పుట్టకోట వాటర్ ఫిల్టర్ నిర్మించి ఖమ్మం ప్రజల దాహార్తిని తీర్చడానకి కృషి చేశాను అన్నారు. ఈ విమర్శ చేసినాయన అప్పుడు యెక్కడ వున్నాడో కూడా తెలియదని ఏద్ధేవా చేశారు…

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ చావా నారాయణ రావు,ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నాయకురాలు అమర్జాన్, కొంగర జ్యోతిర్మయి తన్నీరువిష్ణుమూర్తి, లాలా, కుమార్, దామోదర్, జక్కంపూడి సుధాకర్, చావా వినోద్ కుమార్ తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.