Read News in Telugu Language
adsdaksha

బుగ్గవాగు ప్రాజెక్టుకోసం మంజూరు చేసిన రూ. 30 కోట్లు ఏమయ్యాయో..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 6

నాడు ప్రజల ఇబ్బందులు చూడలేక ఖమ్మం ( khammam ) అర్బన్ మండలంలో భాగమైన ఈ గ్రామాలను విడదీసి రఘునాథ పాలెం మండలం ఏర్పాటు చేశానని మాజీ మంత్రి ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. సోమవారం సాయంత్రం రఘునాథపాలెం మండలం బంజర గ్రామంలో శ్రీ సీతా రాముల గుడిలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. అనంతరం మూలగూడెం, మంగ్యాతండ,
యన్వి బంజర, రజబెల్లి నగర్, పంగిడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తుమ్మల ప్రసంగించారు.

మంగ్యాతండా గ్రామంలో అక్కడి ప్రజలు ఎడ్ల బండి పై తుమ్మలను వూరేగించి తుమ్మలకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ
నాడు విద్యుత్ సమస్యల నివారణ కోసం పంగిడిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. మండల ప్రజల త్రాగు నీరు ఇబ్బందిని చూడలేక పుట్టకోట వాటర్ ఫిల్టర్ బెడ్ నిర్మించి నలబై రెండు గ్రామాలకు త్రాగు నీరు అందించడం కోసం అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించానన్నారు.

Hospital

మండల ప్రజలకు సాగునీరు అందించడం కోసం బుగ్గవాగు ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్లు తుమ్మల వెల్లడించారు. కానీ మంత్రి గారు తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. దానికి మంత్రిగారి కంపెనీనే కాంట్రాక్టర్ అని, మరి ఆ ముప్పై కోట్ల రూపాయలు ఎటుపోయాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన నుండి ప్రజలను విముక్తి చేయడం కోసమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నన్ను ఈ నియోజవర్గం నుండి పోటీ చేయించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీతా రామ ప్రాజెక్ట్ నీటి ద్వారా ఈ మండలాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ స్కీముల్లో భాగమైన రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, వరి పండించే రైతులకు గిట్టుబాటు ధర మీద అయిదు వందల రూపాయల బోనస్, మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళల ఖాతాల్లో ఇరువై అయిదు వందల రూపాయలు, మీ పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం రఘునాధపాలెం మండలంలో తెలంగాణ ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, యంపిపి గౌరీ లాల్యా, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్
మానుకోండ రాధా కిషోర్, ఎఐసిసి పరిశీలకులు అమర్జాన్, కార్పొరేటర్ మలీదు జగన్, కొంగర జ్యోతీర్మయి, గ్రామ కాంగ్రెస్ నాయకుడు మాలోత్ రాము, మాలోత్ తారాబాయి, హరిసింగ్, రజబెల్లి, బాలాజీ, ఈర్లపుడి సర్పంచ్ దీప్లా, మంచుకొండ సర్పంచ్ రామ్మూర్తి నాయక్, యంపిటీసి సత్యం బాబు, మండల కాంగ్రెస్ నాయకులు గోప వెంకన్న తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.