Read News in Telugu Language
adsdaksha

రఘునాథపాలెం మండలం లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ..

దక్షన్యూస్, ఖమ్మం : నవంబర్ 8

గణేశ్వరం గ్రామ సర్పంచ్ సహా చింతగుర్తి ఎంపీటీసీ, 100 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక..

కనీస మౌలిక సదుపాయాలు లేని రఘునాథపాలెం ( raghunadhapalem ) మండలంలోని గ్రామాలలో గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి రోడ్లు, తాగునీరు.. డ్రైనేజీ వ్యవస్థని శంకుస్థాపన చేసి నిర్మింపజేసిన ఘనత మాదేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. బుధవారం బైపాస్ రోడ్ లోని తుమ్మల క్యాంప్ ఆఫీస్ లోఖమ్మం ( khammam ) అసెంబ్లీ నియోజకవర్గ రఘునాథపాలెం మండలం గణేశ్వరం ( ganeswaram ) గ్రామ సర్పంచ్ గాజుల నీలిమ, గాజుల రమేష్, చింతగుర్తి గ్రామ ఎంపీటీసీ మలోత్ లక్ష్మి, మలోత్ వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు, భూక్య వెంకన్న, వార్డు నెంబర్ బాదావత్ కృష్ణ ,మళ్ళొత్. హుస్సేన్ , భూక్య వెంగళరావు, భూక్య మంత్యా, మలోత్ నరేష్, సురభి రమేష్, షేక్ మహమ్మద్ అలీ తో పాటు, రెండు గ్రామాలకు చెందిన 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీని వీడి మాజీ మంత్రి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Hospital

read also : కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం ..

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, కనీస మౌలిక సదుపాయాలు లేని రఘునాథపాలెం మండలంలోని గ్రామాలలో గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి రోడ్లు, తాగునీరు డ్రైనేజీ వ్యవస్థని శంకుస్థాపన చేసి నిర్మింపజేసిన ఘనత మాదేనని అన్నారు. నెలరోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు.

20 రోజులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై అందరూ పనిచేసి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తుమ్మల కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, పట్టణ అధ్యక్షులు జావిద్, సాదు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, ఎర్నేని రామారావు, తమ్మినేని నాగేశ్వరరావు తో పాటు రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.