Read News in Telugu Language
adsdaksha

గాంధీ తిరిగిన నేలపై అరాచక పాలన..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 9

బెదిరింపులకు పాల్పడ్డట్లు నిరూపిస్తే రాజకీయాలనుండి వైదులుగుతా..
తుమ్మల

స్వాతంత్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన ప్రాంతం ఇదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) గుర్తు చేశారు. గురువారం ఖమ్మం ( khammam ) గాంధీ చౌక్ ప్రాంతంలో తుమ్మల ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నలబై ఏళ్ల నా రాజకీయ జీవితం లో ఇంత అరాచక అవినీతి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.

Hospital

అక్రమంగా సంపాదించిన మట్టి డబ్బులు….ఇసుక డబ్బులు.. ఆఖరికి బ్రాందీ షాప్ ల దగ్గర వసూళ్లు చేసిన సంస్కృతి ఈ దరిద్రపు నాయకులకు ఉందని తుమ్మల ఆరోపించారు. నేను ఏనాడూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో….ఏ వ్యాపారం లో వేలు పెట్టలేదన్నారు. తలుపులు మూసుకొని ఎన్నాళ్ళు బతుకుతారు
.. భయపెట్టి గెలవాలని చూస్తున్నమథం పట్టిన నేతలను తరమి కొట్టాలని పిలుపునిచ్చారు. తుమ్మల ఫలానా వారిని బెదిరించారని నిరూపిస్తే మహాత్మా గాంధీ సాక్షిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటూ చాలెంజ్ చేశారు.

read also : 25 రోజులు కష్టపడితే వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే…

షాప్ లు మూపిస్తే బాక్స్ లు మూసుకోవని తుమ్మల వ్యాఖ్యానించారు. మీ బటన్ లు ఆగవు…చేతి గుర్తుపై మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఓట్లు పడతాయన్నారు.
నలబై ఏళ్ల నా రాజకీయ జీవితం లో ఇంత అరాచక అవినీతి పాలన చూడలేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.