Read News in Telugu Language
adsdaksha

కదం తొక్కిన యువం సైన్యం..

దక్ష న్యూస్, ఖమ్మం : నవంబర్ 10

Dr. కూరపాటి అధ్వర్యంలో భారీ ర్యాలీ..

ఖమ్మం లో అరాచక శక్తుల సంగతి మీ యువ శక్తి తేల్చాలి..

దేశ భవిష్యత్ మార్చే శక్తి యువతకే ఉంది : తుమ్మల..

ఖమ్మం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao )  ప్రచారం లో భాగంగా యువ శక్తి కదం తొక్కింది. తుమ్మల కు మద్దతుగా ఖమ్మం పట్టణ ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ ( dr. Kurapati pradeep kumar ) యువం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
తుమ్మల మాట్లాడుతూ ఈ దేశానికి ఉన్న ఆస్తి యువతే అన్నారు. ప్రపంచంలో మన దేశం అగ్రగామిగా ఉందంటే కారణం యువశక్తే అన్నారు.
ఏ దేశంలో నైనా మంచి డాక్టర్స్ ఇంజినీర్స్ సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారంటే అది మన యువ శక్తే అన్నారు. అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద పుట్టిన దేశం తెలంగాణ భవిష్యత్తు కాదు దేశం భవిష్యత్తు మార్చే శక్తి యువత కు ఉందన్నారు. భారత్ జోడో యాత్ర తో యువత కు రాహుల్ గాంధీ స్ఫూర్తి గా మారారని పేర్కొన్నారు.

Hospital

Read also : అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని … దాడులతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు…

తెలంగాణ యువత కు గత పదేళ్ల లో అన్యాయం జరిగిందని తుమ్మల పేర్కొన్నారు. యువత నోట్లో మన్ను కొట్టారు….ఆ మన్ను మీరు ఎన్నికల్లో కొట్టాలి.. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాలి
కొండలు పిండి చేసే శక్తి మీకుంది….బి.ఆర్.ఎస్ ఓ లెక్కా అంటూ వ్యాఖ్యానించారు.

భగత్ సింగ్ పోరాట స్పూర్తితో ఖమ్మం లో వేలాది గా యువత తరలి వచ్చి ఖమ్మం లో అరాచక శక్తుల సంగతి మీ యువ శక్తి తేల్చాలన్నారు.

ఖమ్మం లో అక్రమంగా పోలీస్ కేసులు పెట్టినోళ్ళ సంగతి చూద్దాం అని తుమ్మల అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఖమ్మం లో యువత కలసి కట్టుగా కదం తొక్కి అవకాశ వాదులను తిప్పికొట్టాలన్నారు. అనంతరం యువం పౌండేషన్ వందలాది మంది సభ్యులతో నిర్వహించిన ర్యాలీ కార్యకర్తల్లో నాయకుల్లో జోష్ పెంచింది.

Leave A Reply

Your email address will not be published.