Read News in Telugu Language
adsdaksha

కూనవరంలో పుట్టిన మంత్రి నేను లోకల్ అంటుంన్నారు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 17

రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఇక్కడ ఎక్కడైనా పోటీ చేయవచ్చని మంత్రికి తెలియదా : తుమ్మల

కూనవరం ( kunavaram ) లో పుట్టి అక్కడ చదువుకున్న మంత్రి నేను లోకల్ అంటున్నారు .. రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనే విషయం మంత్రి కి తెలియదా అని ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం ( khammam ) పట్టణంలోని 45, 49 డివిజన్లలో తుమ్మల విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ ప్రాంతం నుండి బొమ్మన సెంటర్ మీదుగా మామిల్లగూడెం వరకు సాగిన ర్యాలీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొమ్మన సెంటర్ లో ఏర్పాటుచేసిన సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
మంత్రి పువ్వాడ అజయ్ ( minister puvvada ajay ) పై సెటైర్లు వేశారు.

సాక్షాత్తు బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు ఎక్కడ పుట్టారు ఎక్కడ పోటీ చేస్తున్నారు .. మంత్రి కి ఆ మాత్రం అవగాహన లేదా అని తుమ్మల ప్రశ్నించారు. ఖమ్మం పోరాటల గడ్డ , బెదిరిస్తే ఎవ్వరు భయపడరు..అరాచకం అవినీతితో బొమ్మన సెంటర్ లో వ్యాపారులను తోపుడు బండ్ల వారిని ఇబ్బంది పెట్టారు.. కాంగ్రెస్ పాలన వచ్చాక మీ సమస్యలు పరిష్కారిస్తాం అని అక్కడ వ్యాపారులకు హామీ ఇచ్చారు.

Hospital

read also : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటాం..

కమీషన్ల కోసం రేకుల షెడ్ బస్టాండ్….కురిసే కార్పొరేషన్ బిల్డింగ్ ఎవ్వరు కట్టారో చూసారు ..దందా చేసి అక్రమంగా ఆస్తులు పోగేసుకున్న వారి వద్ద నుండి వాటిని కక్కిస్తామని తుమ్మల అన్నారు. ఖమ్మం లో ప్రశాంతం గా చిరు వ్యాపారులు బతికేలా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు జావిద్, దీపక్ చౌదరి స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం సాయిబాబా గుడి దగ్గర ఏర్పాటు చేసిన సభలో
మాజీ మంత్రి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు
చేశారు. నేను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు ఆరు గంటలే సరఫరా అవుతుందన్నారు. కరెంట్ ప్రాజెక్ట్స్ లో కమీషన్ల అవినీతి ..కరెంట్ కొనుగోలు లో అవినీతి జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ లను కమీషన్ల కోసం కూలిపోయేట్టు కట్టారని విమర్శించారు.

ఖమ్మం బీహార్ మాదిరి తయారైందని తుమ్మల అన్నారు.
ఖమ్మం లో అరాచక అవినీతి కబ్జాదారుల ను తరమి కొట్టాలని,
ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జావిద్ , డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, స్థానిక కాంగ్రెస్, టిడిపి, సీపీఐ, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.