Read News in Telugu Language
adsdaksha

తుమ్మల పొంగులేటి చెట్టాపట్టాల్.. ఇద్దరం ఒక్కటే.. అంటూ సంకేతం..!

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 18

పాలేరు ఖమ్మం మాకు రెండు కళ్లు అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు ..

ఏ కష్టమొచ్చినా మేమున్నాం అంటూ కార్యకర్తలకు భరోసా..

ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం..

మాకు ఖమ్మం ( khammam ) అయినా… పాలేరు ( paleru ) అయినా ఒక్కటే. రెడ్డి గారికి పాలేరయినా, నాకు ఖమ్మం అయినా.. మా ఇద్దరికీ రెండు కళ్ళతో సమానం. అక్కడ ఆయన, ఇక్కడ నేను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇద్దరం ఒక్కటిగా ముందుకెళతాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ ( congress ) ను గెలిపించాలి అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ (sr convention ) హాల్లో నిర్వహించిన కూసుమంచి ( kusumanchi ), ఖమ్మం రూరల్ ( khammam rural ), నేలకొండపల్లి ( nelakondapalli ) మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు.

Hospital

read also : మీరే కాదు.. మీ నాయన, తాతా ఉన్నా ఇలాగే చేర్చుకుంటాం..

పాలేరుకు పెద్ద పాలేరుగా ఉంటానన్న మాట నిలుపుకున్నానని, ఇప్పుడు రెడ్డి గారు కూడా అదేరకంగా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా ఇన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నామని, భవిష్యత్తులోనూ ఇదే పద్ధతిని పాటిస్తామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasareddy ) మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేకమంది రెచ్చగొడతారని, ఎలాంటి పట్టింపులకు పోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం లేకున్నా, బీఆర్ఎస్ ( brs ) ఎమ్మెల్యేలు అనేక కేసులతో భయభ్రాంతులకు గురిచేసినా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటామని అభయమిచ్చారు.

read also : డాక్టర్ల మద్దతుకై తుమ్మల వేట..

కాంగ్రెస్ లో అంతా సమిష్టిగా పనిచేసి నిరంకుశ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా విజయం అందించాలని పొంగులేటి పిలుపు నిచ్చారు. కేసీఆర్ మాయమాటలతో ఇన్నేళ్లు పాలన సాగించారని విమర్శించారు. అధికార మదం నెత్తికెక్కి అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ ను ఇంటికే పరిమితం చేయాలని కోరారు. జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్ అంటూ తుమ్మల, పొంగులేటి నినాదాలు చేసి శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, సాధు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.