Read News in Telugu Language
adsdaksha

17 న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి..

దక్ష న్యూస్, ఖమ్మం నవంబర్ 15

మేము కరకట దమనులం అయితే మా చుట్టూ తిరిగిన ఆయనను ఏమనాలి….

ఖమ్మం ప్రెస్ మీట్ లో తుమ్మల, పొంగులేటి ..

భారత భవిష్యత్ కు నాంది ఈ తెలంగాణ ఎన్నికలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. ప్రజలు ధర్మం వైపు నిలబడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బుధవారం ఖమ్మం ( khammam ) లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం మార్పు కి నాంది కావాలన్నారు.

మేము ఏ పార్టీ లో ఉన్నా పార్టీ కీర్తి ప్రతిష్టలకోసం పార్టీ అభ్యున్నతికి పాల్పడే వాళ్ళం అని తుమ్మల అన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఒకటే స్పీచ్ ప్రతీ నియోజకవర్గంలో మాట్లాడుతున్నాడు నా మిత్రుడు కేసీఆర్…మేధావి అయిన కేసీఆర్ స్పీచ్ చూస్తే జాలి వేస్తుందన్నారు.

Hospital

మా ఇద్దరి రాజకీయ జీవితం చూసిన కేసిఆర్ ఇలా మాట్లాడుతుంటే జాలేస్తుందని పొంగులేటి అన్నారు. మేమిద్దరం కరకట దమనులం అయితే మా చుట్టూ తిరిగిన ఆయన్ని ఏమనాలని ప్రశ్నించారు.

17 ఉదయం 10. గం మణుగూరు లో రాహుల్ గాంధీ రోడ్డు షో, ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుందన్నారు. సభను విజయవంతం చేయాలని పినపాక నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గత కొద్దిరోజులుగా తెలంగాణ ప్రజలు రాజకీయాల్ని స్పష్టంగా పరిశీలిస్తున్నారన్నారు.

కేసీఆర్ కేటీఆర్ పదే పదే కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే అని చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది అని వాళ్లకు తెలుసు అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. ఉచిత కరంటు ను కేసీఆర్ కనుగొన్నట్లు కాంగ్రెస్ కు తెలియనట్లు కాంగ్రెస్ పార్టీ మాట్లాడని మాటలను వక్రీకరిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ కి ప్రజల అండ ఉందని పొంగులేటి అన్నారు. మీకు డబ్బు అండ ఉంది. ప్రజల చందా తో ఎన్నిక చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. మీరు బిర్యాని పెట్టినా, మేము చెట్నీ పెట్టినా మా బువ్వ ను సంతోషంగా తినడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.