Read News in Telugu Language
adsdaksha

నేటి యువతరం మెచ్చే బైక్ జావా 350 : తుమ్మల యుగంధర్

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 27

నేటితరం కుర్రకారు మెచ్చే బైక్ జావా 350 అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తనయుడు తుమ్మల యుగంధర్ అన్నారు.. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని మమత రోడ్లో జావా యజ్ డి షోరూమ్ లో జావా 350 ని తుమ్మల యుగంధర్ లంచనంగా ప్రారంభించారు.

Hospital

Read also: భూ బాధితులకు న్యాయం చేయడమే గద్దరన్నకు నిజమైన నివాళి : డిప్యూటీ సీఎం భట్టి

ఈ సందర్బంగా జావా యజ్ డి ( jawa yezdi ) షోరూం ఖమ్మం యువతకోసం అందుబాటులోకి తీసుకొచ్చిన యజమాని గౌతం, కృష్ణ, భార్గవ్ లను అయన అభినందించారు.. ఈ సందర్బంగా ఆయన షోరూంలోని నూతన జావా యజ్ డి రకాలను చూసి నేటి యువతరం హందాగ నడిపే ఏకైక బండి జావా అని అన్నారు..పూర్వ కాలంలో జావా యజ్ డి గ్రామాల్లో ఒకరిద్దరూ నడుపుతుంటే మాలాంటి వాళ్ళు ఎప్పటికైనా యజ్ డి పై ఒక్కసారైనా రైడ్ చేయాలనీ కూతుహలంగా ఉండేదని యుగంధర్ తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు..ప్రస్తుతం మార్కెట్లో జావా యజ్ డి బండ్లకు తెగ డిమాండ్ ఉందని యుగంధర్ తెలిపారు.. యజ్ డి షోరూంలు ఖమ్మం, కొత్తగూడెంలో ఏర్పాటు చేయటం యువకులకు వరప్రదాయినిగా మారిందని యుగందర్ కొనియాడారు..తుమ్మల యుగంధర్ లాంచ్ చేసిన జావా యజ్ డి 350 మోడల్ 2,18 లక్షలకు మార్కెట్లో అందుబాటులో ఉందని షోరూం నిర్వాకులు గౌతం, కృష్ణ, భార్గవులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.