Read News in Telugu Language
adsdaksha

టియుడబ్ల్యుజె రాష్ట్ర మహాసభల ఆహ్వాన కమిటి అధ్యక్షులుగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 16

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల19.20వ తేదిల్లో రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( tuwj iju ) రాష్ట్ర మూడవ మహాసభలకు ఆదివారం ఆహ్వాన కమిటిని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు, సామాజికవేత్త డాక్టర్ కూరపాటి ప్రదీప్, ప్రధాన కార్యదర్శిగా టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు, సలహాదారుడిగా టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణలతోపాటు జిల్లాకు చెందిన టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా,రాష్ట్ర నాయకులు,ప్రముఖ జర్నలిస్టులు,ట్రేడ్ యూనియన్ నేతలు మొత్తం 150మందితో ఈ కమిటిని ఎన్నుకున్నారు.

Read also: ఇక కరెంటుపై గ్రామసభలు.. మాజీ విద్యుత్తు శాఖా మంత్రి కోరిక మేరకే న్యాయ విచారణ : డిప్యూటీ సీఎం భట్టి..

ఈ కమిటీలో టియుడబ్ల్యుజె జిల్లా నాయకులు కె. రవీంద్ర శేషు, నర్వనేని వెంకట్రావ్, మాటేటి వేణుగోపాల్, నలజాల వెంకట్రావ్, సామినేని మురారీ, మైసపాపారావు, ఖదీర్, ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, మామిడాల భూపాల్, గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, మైనోద్దిన్, నామపురుషోత్తం, శివానంద, జనార్దనాచారి, కె.వి,చెరుకుపల్లి శ్రీనివాస్,ఏలూరి వేణుగోపాల్ రావు,కళ్యాణ్,అలస్యం అప్పారావు,జకీర్, కమటం శ్రీనివాస్ ,జిల్లా ,నగర కమిటి సభ్యులు ,ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోజర్నలిస్ట్ యూనియన్ ,ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నేతలు,పలు ట్రేడ్ యూనియన్ నేతలు తదితరులు ఉన్నారు.

Hospital

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర మహాసభలకు రెండు పర్యాయాలు అతిధ్యం ఇచ్చిన ఖమ్మ జిల్లా, తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారిగా రాష్ట్ర మూడవ మహాసభకు మరోసారి అతిధ్యం ఇవ్వబోతుంది. రాష్ట్ర డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు మీడియా అకాడమి చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు రేణుకచౌదరి, రామసహాయం రఘురాంరెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,డాక్టర్ పార్ధసారధి రెడ్డి,మాజీ ఎంపి నామ నాగేశ్వర్ రావు,ఎమ్మెల్సీతాతామధు,జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు,నగర మేయర్ పునుకొల్లు నీరజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం,సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు,తానా మాజీ అధ్యక్షులు జయశేఖఱ్ తాళ్ళూరి ,ఐజెయు నాయకులు బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్ ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, ఎం ఏ మాజీద్, వై నరేందర్ రెడ్డి, డి సోమసుందర్, కల్లూరి సత్యనారాయణ, అలపాటి సురేశ్ కుమార్, నగునూరి శేఖర్,కె విరాహత్ అలీ తదితర నాయకులు పాల్గొంటారు.

Read also: నేటి విద్యార్థుల భవిష్యత్తే రేపటి రాష్ట్ర భవిష్యత్తు .. విద్యార్థుల మధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు..

8 సబ్ కమిటీల ఏర్పాటు..

రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం పలువురు సీనియర్ జర్నలిస్టులతో 8 కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా టియుడబ్ల్యుజె (ఐజెయు) అధ్యక్ష ,కార్యదర్శులు వనం వెంకటేశ్వర్ల,ఏనుగు వెంకటేశ్వర్ రావు తెలిపారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫూడ్ కమిటీ కన్వీనర్ గా సామినేని మురారీ,వసతుల కమిటీ కన్వీనర్ గా మాటేటి వేణుగోపాల్,ప్రోటోకాల్ కమిటి కన్వీనర్ గా నర్వనేని వెంకట్రావ్,ఫైనాన్షియల్ కమిటి కన్వీనర్ గా ఏనుగు వెంకటేశ్వర్ రావు, కో కన్వీనర్లుగా వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్, ఖదిర్ ప్రచార కమిటి కన్వీనర్ గా మైసపాపారావు,మెమోంటోస్ ఆండ్ గిప్ట్ కమిటి కన్వీనర్ గా నల్లజాల వెంకట్రావ్,మీడియా కమిటి కన్వీనర్ గా మోహినోద్దిన్ ,కో కన్వీనర్ గా నామ పురుషోత్తం,రవాణ కమిటి కన్వీనర్ గా చెరుకుపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రతి కమిటీలో అయిదుగురు నుంచి 8మంది సభ్యులు ఉన్నారు. ఆయా కమిటీలు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేయనున్నాయి. జిల్లాకు విచ్చేసే ప్రతినిధులకు ఏలాంటి లోటుపాట్లు లేకుండా చక్కని అతిధ్యం ఇచ్చేందుకు కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.