Read News in Telugu Language
adsdaksha

జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై మరో ఉద్యమం ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 15

పవిత్రమైన జర్నలిజాన్ని కాపాడుకుందాం..

అక్టోబర్ 2న జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా  ఆందోళనలు..

అధికారంతో అంటగాగే యూనియన్లకు మనుగడ లేదు..

టియుడబ్ల్యుజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహాత్ అలీ..

పవిత్రమైన జర్నలిజం (journalism ) ముసుగులో పాత్రికేయ వృత్తి గౌరవాన్ని భంగం కలిగించే అసాంఘీక శక్తులకు తగిన గుణపాఠం చెప్పేందుకు మరో ఉద్యమం చేప్పటాల్సిన తరుణం అసన్నమైందని టియుడబ్ల్యు జె (ఐజెయు)  ( tuwj iju ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహాత్ అలీ (virahath ali ) అన్నారు. శుక్రవారం ఖమ్మం ( khammam ) జిల్లా కేంద్రంలో జరిగిన టి యు డబ్ల్యు జె ఐజెయు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఒకప్పుడు పోలీసులంటే అంతా భయపడే వారని, ఇప్పుడు జర్నలిస్ట్ ( journalist ) అంటే భయపడే రోజులు వచ్చాయన్నారు.

దీనికి ప్రధాన కారణం కొంతమంది అసాంఘీక శక్తులు మీడియా ముసుగు లో చేస్తున్న అరాచకాలే అని, వృత్తినే నమ్ముకున్న నిజమైన జర్నలిస్టులకు అపవాదు వచ్చేవిధంగా ప్రస్తుత పరిస్థితి తయారైందన్నారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో 9మంది ముఠా, జర్నలిస్టుల పేరుతో ఒక రైస్ మిల్లు యజమానిని బెదిరింపులకు గురిచేసిన సంఘటన జర్నలిస్టు వృత్తికే కళంకంగా మారిందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి అసాంఘీక శక్తులను నిరోదించకపోతే సమాజంలో జర్నలిజం వృత్తి మరింత భ్రష్టు పడే ప్రమాదం ఉందన్నారు.

read also : వైద్య విద్యలో నవశకానికి నాంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

గతంలో ఒక ఊరిలో జర్నలిస్ట్ ఉంటే ఆ ఊరికి ఎంతో మేలు జరుగుతుందని ప్రజలంతా భావించే వారు కాని ఇప్పుడు జర్నలిస్టు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయే పరిస్థితి ఏర్పడిందని విరాహాత్ అలీ అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్ లో గాని, జిల్లా కేంద్రాల్లో గాని విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే నిర్వహకులు భయపడే పరిస్థితి నేడు దాపురించిందన్నారు. నిజమైన మీడియాను బ్రతికించేందుకు మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసమే కాదు మీడియా రంగాన్ని దెబ్బతీసే వాళ్ళపై కూడా ఉద్యమించక తప్పదన్నారు. పవిత్రమైన పాత్రికేయ వృత్తిని ఆగౌరవ పర్చే శక్తుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అనేక కార్యక్రమాలను తీసుకరావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఆందోళనలు..

జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చిందని ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని విరాహాత్ అలీ పిలుపు నిచ్చారు. పాత్రికేయులకు న్యాయస్దానం అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఎత్తివేసేందుకు, వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పాట్నాలో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే ఉద్దేశ్యంతో రానున్న అక్టోబర్ 14న జాతీయ స్దాయిలో మహిళ సదస్సును ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు పంపిణీ చేయాలని, హెల్త్ కార్డులు అన్ని కార్పోరేట్ ఆసుపత్రులో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఇటివల రాష్ట్ర కమిటి ఇచ్చిన పోస్టు కార్డు ఉద్యమానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. సుమారు పదివేల పోస్టుకార్డులు ప్రగతి భవనం కు చేరాయన్నారు. త్వరలో మారోరూపంలో ఉద్యమకార్యచరణకు పిలుపు నివ్వడం జరుగుతుందన్నారు. ఇళ్ళ స్ధలాల విషయంలో స్దానిక ఎమ్మెల్యేలపై వత్తిడి పెంచాలని, వారి చొరవ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2600మంది జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు దక్కాయన్నారు. 2018 వరకు జర్నలిస్ట్ హెల్త్ కార్డులు అద్బుతంగా పనిచేశాయని, ఆ తరువాత నుంచి కార్పోరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని తెలిపారు. అయితే త్వరలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు మెరుగైన నూతన హెల్త్ కార్డు విధానంను తీసుకరాబోతున్నారని ఈవిషయాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తమ యూనియన్ ప్రతినిధి బ్రంధానికి హామి ఇచ్చారన్నారు.

Hospital

read also : టెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ..

ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఈ కొత్త స్కీమ్ ను ప్రకటించే అవకాశం ఉందని విరాహత్ అలీ తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు హైల్త్ స్క్రీనింగ్ క్యాంపులు ప్రభుత్వం నిర్వహించబోతుందన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ విద్యా సంస్ధలో ఫీజు రాయితీ కోసం డి ఇ వోలతో సర్కులర్ ను జారీ చేయించడం కంటే ప్రభుత్వం నుంచి జి వో జారీ చేయించేందుకు ప్రభుత్వం పై వత్తిడి పెంచుతామన్నారు.

అధికారంతో అంటగాగే యూనియన్లకు మనుగడ లేదు..

అధికారంతో అంటగాగే ఏ ట్రేడ్ యూనియన్ అయినా, ఉద్యోగ సంఘాలు అయినా మనుగడ సాగించలేవని విరహాత్ అలీ అన్నారు. భజన సంఘాలు పదవుల కోసం ప్రాకులాడుతాయే తప్ప జర్నలిస్టుల హక్కుల కోసం కోట్లాడలేవన్నారు. 60ఏళ్ళ చరిత్రలో తమ యూనియన్ కు పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల చరిత్ర ఉందే తప్ప ఏనాడూ కూడా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండలేదన్నారు. పదవులకోసం ప్రాదేయపడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొంతమంది దుర్బుద్దితో కొత్త దుకాణాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పదవులకోసం సాగిల పడ్డారన్నారు. జర్నలిస్ట్ వృత్తిని నమ్ముకొని, సామాజిక స్ప్రహ కలిగిన 13వేల మంది సభ్యులు కలిగిన నిరంతరం పోరాటపటిమ కలిగిన టియుడబ్ల్యుజె గతంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఎన్నో సంక్షేమపధకాలను సాధించుకున్నామన్నారు.

భారత దేశంలోనే అత్యధిక స్దాయిలో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా మన యూనియన్ కు గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 50వేల మంది కి అక్రిడేషన్లు ఉంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 50వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లను సాధించిన ఘనత కూడా తమ సంఘానికే దక్కుతుందన్నారు.30 ఏళ్ళ క్రితం పత్రిక యజమానులు తమ పత్రికలో పనిచేసే విలేఖర్లను పాలేర్లకంటే హీనంగా చూసే రోజుల్లో కనీసం పత్రిక నుంచి గుర్తింపు కార్డును జారీ చేయడానికి కూడా ఇష్టపడని రోజుల్లో గ్రామీణ విలేఖర్లను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని అనాడు ఉద్యమించిన ఫలితంగానే 1996లో సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర మహాసభలో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ విలేఖర్లకు అక్రిడేషన్లు ఇవ్వడానికి అంగికరించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

గ్రామీణ విలేఖర్ల కోసం ఉద్యోగ భద్రత కోసం పోట్లాడి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర కూడా తమ యూనియన్ కే ఉందన్నారు. లేబర్ కోర్టు ద్వారా ఎంతో మంది మండల విలేఖర్లకు పత్రికయజమాన్యం ద్వారా నష్టపరిహారం ఇప్పించిన ఘనత తమదేనన్నారు. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర రాజధానిలో ఐదువేల మంది జర్నలిస్టుతో గర్జించడంతో పాటు గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరించి జంతర్ మంతర్ వద్ద భారీ వర్షంలో కూడా ధర్నా చేసి అనాటి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై మొరపెట్టుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం, కనీస మౌళిక సదుపాయాలను కల్పించేందుకు నిరంతరం పోరాటాలు చేస్తుంటామని విరహాత్ అలీ ప్రకటించారు.

హక్కుల కోసం పోరాడింది ఐజేయునే..

రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాం నారాయణ మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడి ఎన్నో విజయాలు సాధించిన టియుడబ్యుజె ఇళ్ళ స్ధలాల కోసం అదే పటిమతో ముందుకు వెళ్తుందన్నారు. సమాజసేవలో నిమగ్నం అయిన జర్నలిస్టుల్లో అత్యధికులు నిరుపేద కుటుంబాల నుంచే వచ్చిన వారేనని వారికోసం తాము గొంతెమ్మ కోర్కెలు కోరకుండా ఉండటానికి గూడును మాత్రమే అడుగుతున్నామన్నారు. చాలా జిల్లాలో స్దానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక చోరవ తీసుకొని ఇళ్ళ స్ధలాలు ఇప్పించారని, ఈ జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కోరారు. స్ధానిక జర్నలిస్టులు కూడా స్ధానిక ఎమ్మెల్యేలపై వత్తిడి తీసుకరావాలని కోరారు. ఇప్పటికి మనం అందుకున్న ఫలాలు తమ యూనియన్ ఆధ్వర్యంలో సాధించికున్నవేనని ఆయన అన్నారు.

read also : ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు..ఎందుకు…?

టిజేఎఫ్ నుండి ఐజేయులో భారీ చేరికలు..

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ సమక్షంలో టిజెఎఫ్, ఇతర జర్నలిస్ట్ సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న ఐజెయు లో చేరారు. ఇప్పటి వరకు టిజేఎప్ లో కీలకంగా పనిచేసిన వారంతా ఖదీర్, దువ్వా సాగర్, కె.వి,పెండ్ర ఆంజయ్య, యాకేశ్, సంతోష్, నాగేందర్ రెడ్డి నేతృత్వంలో వంద మంది ఐజెయులో చేరారు. ఈ సందర్బంగా కొత్తగా చేరిన వారికి సభ్యత్వ రశీదును అందజేసి కండువాలు కప్పి స్వాగతించారు. కొత్తగూడెం జిల్లా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ ,సీనియర్ టిజెఎఫ్ నాయకుడు పుసులూరి రవి, టిజెఎప్ సీనియర్ నాయకుడు, ఖమ్మం ఆంద్రజ్యోతి స్టాప్ రిపోర్టర్ తాళ్ళూరి రమేశ్ పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర ప్రసాద్, పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు దానకర్ణ, కొత్తగూడెం జిల్లా అక్రిడేషన్ కమిటి మెంబర్, ఎలక్రానిక్ మీడియా సెక్రటరీ, సిహెచ్ నర్సింహ్మరావు, అంజాద్, గోపి, టిజెఎఫ్ కెమెరామెన్ అసోసియన్ జిల్లా కార్యదర్శి ఫయాజ్, ఉపాధ్యక్షులు అయూబ్, శరత్, వివిధ మండలాలకు చెందిన దాదాపు 80మంది జర్నలిస్టులు ఐజెయు లో చేరారు.

టియుడబ్ల్యుజే ఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు అతిధులను వేధికపైకి ఆహ్వానించగా, హెచ్ జె యు అధ్యక్షులు శంకర్ గౌడ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంధ్ర శేషు, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్, మాటేటి వేణుగోపాల్, సామినేని మురారీ, ఖాదర్ బాబా, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి నల్లజాల వెంకట్రావ్, వి6 ఖధీర్, దిశ సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, మామిడాల భూపాల్, కోశాధికారి అయ్యప్ప, ఎబిఎన్ శ్రీధర్, కెవి, జిల్లా కోశాధికారి శివానంద, నగర కమిటి అధ్యక్షులు మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, ఇతర జిల్లా నాయకులు తాళ్ళూరి మురళీ, జనార్ధన చారీ, నామ పురుషోత్తం, సత్యనారాయణ, మేడి రమేశ్, యాకేశ్ , సంతోష్, రామక్రిష్ణ, జిల్లాకమిటి సభ్యులు యోగి, పోలంపల్లి నాగేశ్వర్ రావు, తాతా శ్రీనివాసరావు, నాగిరెడ్డి, బహుదూర్, నాగరాజు, సి హెచ్ రమేశ్, కెమెరా మెన్ అసోసియేషన్ అధ్యక్షులు అలస్యం అప్పారావు, ఫోటోగ్రాఫర్ అసోసియేన్ నుంచి కమటం శ్రీనివాస్, మహిళా ప్రతినిధి మధులత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.