Read News in Telugu Language
adsdaksha

ఘనంగా జర్నలిస్ట్ నాయకుడి జన్మదిన వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 3

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( tuwj tjf ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ జన్మదిన వేడుకలు బుధవారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. యూనియన్ జిల్లా కమిటీ, నగర కమిటీ, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం సభ్యులు తమ నాయకుడు ఆదినారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నేతలు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం, యూనియన్ బలోపేతం కోసం ఆహర్నిశలు శ్రమించే ఆకుతోట ఆదినారాయణ సేవలు ఎల్లప్పుడూ జర్నలిస్ట్ ల మనసుల్లో నిలిచే ఉంటాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉండే ఆయన తత్వం, మంచితనం వల్లే జర్నలిస్ట్లులు ఆయనకు అభిమాన పాత్రులుగా మారిపోయారన్నారు. జర్నలిస్ట్ ల పక్షపాతి ఆదినారాయణ ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు.

Hospital

read also : 17 వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలి : సి.ఎస్. శాంతికుమారి

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి చిర్రా రవి, అమరవరపు కోటేశ్వరరావు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, రాఘవ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, టీఎస్ చక్రవర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సహాయ కార్యదర్శి షేక్ జానీ పాషా, జిల్లా నాయకులు మందుల ఉపేందర్, జిల్లా మహిళా ప్రతినిధి వంగూరి ఈశ్వరి, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, కోశాధికారి సీతారామశాస్త్రి, జిల్లా నాయకులు ఉత్కంఠం శ్రీనివాస్, నాగయ్య, యాదగిరి, జీవన్ రెడ్డి, తిరుపతి రావు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.