Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో టీజేఎఫ్ నూతన సంవత్సర వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 1

— కేక్ కట్ చేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

నూతన సంవత్సరం సందర్భంగా 2024 ప్రారంభ వేడుకలు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీజేఎఫ్) అనుబంధ ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రతి జర్నలిస్టు కుటుంబంలో ఈ ఏడాది వెలుగులు నిండాలని కోరుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని, ఐక్యంగా స్నేహభావంతో జర్నలిస్టులందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Hospital

Read also: దేశ ప్రజలకు రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు….

ఈ వేడుకల్లో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, టీఎస్ చక్రవర్తి, పిన్ని సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సహాయ కార్యదర్శి షేక్ జానీ పాషా, జిల్లా నాయకులు మందుల ఉపేందర్, జిల్లా మహిళా ప్రతినిధి వంగూరి ఈశ్వరి, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, కోశాధికారి సీతారామశాస్త్రి, జిల్లా నాయకులు వల్లూరి సంతోష్, ఉత్కంఠం శ్రీనివాస్, పొన్నెబోయిన పానకాలరావు, యాదగిరి, పులి శ్రీను, బండి కుమార్, ఖాసిం, రోసిరెడ్డి, పప్పుల వేణుగోపాల్, నల్లమోతు శ్రీనివాస్, యాదగిరి, మదార్ సాహెబ్, వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.