Read News in Telugu Language
adsdaksha

శ్రీ క్రోధి కావాలి మహా బోధి.. డా…గిరిసింహారావ్..

ఉగాది కవిత..

కాలం కానివేళ కాలం మరోసారి పురుడుపోసుకుంది!
ఆగని ఋతు క్రమంలో చైత్రం పునరావిర్భవిస్తుంది!!

కాల గర్భానికి తొమ్మిది కాదు పన్నెండు నెలలు….
ఇప్పుడు ఈ నవజాత…”శ్రీ క్రోధి” —
ప్రసవం నీది- ప్రసవ వేదన మాది

కాలం కాని వేళ కాలం కేదారాల్లో సైకతాల్ని వెదజల్లుతుంది.
మానవత్వం ఎండిన చెలిమ. తోడుతుంటే పాతాళం.. లోలోన తాకుతుంది..

రాజకీయం బహురూపి ..
కోయిల ఆలాపన….మాని కాకై ప్రేలాపన.-

కాలం వేసిన చిక్కుముళ్ళని విప్పడంలోనే మనిషి జీవితం నిమగ్నం
రాజ్యం విసిరిన గాలంలో ఉచితం సముచితాల మధ్య దేశప్రజ సమస్తం.

గంజాయి వనంలో యువత విహారిస్తోంది.
నీరందక తులసి వనం హరిస్తోంది.

Hospital

చెడే మంచిగా చెలామణీ లోసగటు మనిషి కి తరగని అప్పు..।

కృత్రిమ మేథో తరంగాలు తిరగబడి ఉప్పెనై జాతిపై విరుచుకు పడకముందే…
వాయిస్ క్లోనింగ్ తో నీ గొంతే నీకు గోతులు తీయకముందే…
డీప్ ఫేకింగ్ లో నీ రూపమే నీకు శత్రువై నీతో యుద్ధం చేయకముందే…

శాస్త్రీయత ఆధునికతల పెనుగాలిలో నైతికత ఎగిరిపోయే ముప్పు!

కాలం కాని కాలం….సంధికాలంలో
శ్రీ క్రోధి!
మహా జనానికి కావాలి నువ్వో మహా బోధి!

 

ఋషి
డా…గిరిసింహారావ్
వైద్యుడు, రచయిత సామాజికవేత్త………ఖమ్మం

Leave A Reply

Your email address will not be published.