Read News in Telugu Language
adsdaksha

జూన్ 16న యూజీసీ నెట్ ఎగ్జామ్.. నోటిఫికేషన్ విడుదల.. మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 21

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ 2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

Read also: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు.. 23న ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్..

పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ జూన్ – 2024 దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభం కానుంది. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు మే 10 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మే 12న రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు.

Hospital

దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులకు రూ.1150, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (నాన్-క్రిమిలేయర్)- రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌కు రూ.325 ఫీజుచెల్లించాలి. ఈ నెట్ ఎగ్జామ్‌ను ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 16న యూజీసీ నెట్-2024 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో, రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

Read also: తుమ్మలపై దాడి కేసులో నిజాలను నిగ్గు తేల్చాలి.. ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ..

ఇదిలావుంటే.. మొత్తం 83 సబ్జెక్టుల్లో ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ ఉండనుంది.

Leave A Reply

Your email address will not be published.