Read News in Telugu Language
adsdaksha

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం .. 13 మందికి గాయాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 25

జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. హోలీ సందర్భంగా ప్రధాన గోపురం కింద గర్భగుడిలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Read also: టెట్ ధరఖాస్తు ఫీజును తక్షణమే తగ్గించాలి : తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామరావు డిమాండ్..

ఆరుగురి పరిస్థితి విషమం..

Hospital

ఆలయంలో స్వామివారికి గులాల్ సమర్పిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అక్కడ ఏదో వస్త్రం తగిలి అర్చకులు, భక్తులపై పడింది. ఈ విషయాన్ని ఆలయ పూజారి ఆశిష్ కూడా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మందికి గాయాలు కాగా వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్‌కు తరలించారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గౌర్ కూడా ఉన్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి కుమారుడు, కుమార్తె సురక్షితం..

ఈ ప్రమాదంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే వారు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.