Read News in Telugu Language
adsdaksha

సివిల్స్ నోటిఫికేషన్.. మే 26న ప్రిలిమ్స్.. అక్టోబర్ 19న మెయిన్స్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 15

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (Upsc) శుభవార్త తెలిపింది. అఖిల భారత సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసు ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. గతంలో యూపీఎస్సీ ( union public service commission ) విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్‌కు మార్చి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అవకాశం కల్పించారు. సివిల్స్ ఎగ్జామ్‌కు సంబంధించి మే 26న ప్రిలిమ్స్, అక్టోబరు 19న మెయిన్స్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.

Hospital

read aalso : Uae : యూఏఈలో తొలి హిందూ దేవాలయం .. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ..

దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 పోస్టులకు సపరేటుగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి 21 నుంచి 32 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంటుంది. ఓబీసీ, ఇతర అభ్యర్థులకు రూ.100, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని యూపీఎస్సీ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.