Read News in Telugu Language
adsdaksha

నిలిచిపోయిన యూపీఐ సేవలు.. వినియోగదారులకు ఇబ్బందులు..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 6

దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిన యూపీఐ లావాదేవీల స్క్రీన్ షాట్లను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే చాలా మందికి యూపీఐ డౌన్ అయిందనే విషయం తెలియక పేమెంట్లు చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు పేమెంట్ గేట్ వేలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి.

Hospital

Read also: కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే తీవ్ర నష్టం : మాజీ సీఎం కేసీఆర్..

గూగుల్ పే (Google Pay), ఫోన్ పే(PhonePay), ఫేటీఎం (Paytm), భీం (BHIM) వంటి అప్లికేషన్ ల ద్వారా డబ్బులు పంపించలేక చాలా గంటల పాటు వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కంపెనీలు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. యూపీఐ సర్వీసులు డౌన్ కావడం ఫస్ట్ టైం కాదు. కానీ కీలకమైన టైంలో సర్వర్లు మొరాయిస్తుండటం యూజర్లను వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.