Read News in Telugu Language
adsdaksha

కాళేశ్వరం తో లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 4

నీటి పారుదల శాఖను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( uttam kumar reddy ) ఆరోపించారు. రెండు టీంఎంసీల కోసమే కేసీఆర్ ( kcr ) కాళేశ్వరం కట్టారని దుయ్యబట్టారు. చంద్రశేఖర్ రావు రూ. 95 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ( kaleswaram ) కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లియ్యలేదని ఉత్తమ్ మండిపడ్డారు. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి ప్రజాధనం నీటి పాలు చేశాడని ఫైర్ అయ్యారు.

Read also: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల పెన్షన్ : సీఎం రేవంత్ రెడ్డి ..

Hospital

రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసమే కేసీఆర్ హైలెవల్ మీటింగ్ కు హాజరుకాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. బోర్డు ప్రాజెక్టుల అప్పగింతపై తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను అప్పగించేది లేదని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ నీళ్లు ఎత్తుకు పోతుంటే కేసీఆర్ ఏకాంత చర్చలో మునిగిపోయారని ఆక్షేపించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నే అన్యాయం చేశాడని గుర్తు చేశారు. వాళ్ల ఫ్యామిలీ అంతా కమీషన్లకు కక్కుర్తి పడి అన్ని కార్యక్రమాలు చేశారని విమర్శించారు.

Read also: ఫాస్టాగ్ గడువు పెంపు.. ఈనెల 28వరకు ఈ-కేవైసీ చేసుకోవచ్చు..

పదేండ్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది చాలక నిన్నగాక, మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్, కేటీఆర్, కవిత దుమ్మెత్తిపోయడం హాస్యాస్పదమన్నారు.

Leave A Reply

Your email address will not be published.