Read News in Telugu Language
adsdaksha

63 మంది ఖైదీలకు హెచ్ఐవీ .. లఖ్ నవూ జిల్లా కారాగారంలో కలకలం..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 5

జైలులో శిక్ష అనుభవిస్తున్న 63మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లోని (Uttar Pradesh) లఖ్ నవూ (Lucknow) జిల్లా కారాగారంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. లఖ్ నవూ (Lucknow) జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ (HIV) పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. డిసెంబర్ లో వారికి టెస్ట్ లు చేయగా 36 మందికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలగా తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలామందికి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజీని మరొకరు వాడటం వల్లే ఈ వైరస్ వ్యాపించిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే వీళ్లందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, ఈ జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ సంక్రమించలేదని అంటున్నారు.

Hospital

Read also: చెప్పుతో కొడతా..! సీఎం రేవంత్ పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

తాజా పరిస్థితుల నేపథ్యంలో బాధితులందరికీ లఖ్ నవూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో ఈ జైలులో ఇంతపెద్ద మొత్తంలో హెచ్ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. దీనికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడంతో ఇక్కడి మిగతా ఖైదీల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల సంఖ్య పెరగకుండా వైద్యారోగ్యశాఖ సూచన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.