Read News in Telugu Language
adsdaksha

1671 గవర్నమెంట్ పాఠశాలలు బంద్.. ఉత్తరాఖండ్‌లో విద్యార్థులు లేక మూసివేత..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 26

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థ దారుణంగా తయారయ్యింది. ఏటేటా ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆ రాష్ట్ర సర్కారు భారీగా ప్రభుత్వ స్కూల్స్ మూసివేతకు నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌ ( uttarakhand ) లోని 3573 సర్కారు బడుల్లో విద్యార్థులు చేరడం లేదని, వాటిలో 1671 పాఠశాలలను మూసివేస్తున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ప్రకటించింది.

Hospital

read also : గురుకులాలకు సొంత భవనాలు..

పలు స్కూల్స్‌లో 10 మంది విద్యార్థుల కంటే తక్కువగా జాయిన్ అవుతున్నారని విద్యాశాఖ తెలిపింది. అయితే ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర సర్కారు కొత్త నిర్ణయం తీసుకునేందుకు పావులు కదుపుతోంది. మూసివేసిన బడుల స్థానాల్లో ఫిన్ ల్యాండ్ విద్యావిధానంలో స్కూల్స్ తీసుకురావాలని ఆ రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఈ కమ్రంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి 4 రోజులు ఫిన్ ల్యాండ్ పర్యటన చేశారు. దారుణంగా పడిపోయిన విద్యా వ్యవస్థను పూర్తిగా తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు మూసివేసిన పాఠశాలల భవనాలను అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలుగా వినియోగించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.