Read News in Telugu Language
adsdaksha

ఉద్రిక్తతంగా ఉత్తరాఖండ్ .. మసీదు, మదర్సా కూల్చివేతతో రణరంగం ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 9

నలుగురు మృతి, 100 మందికి గాయాలు..

ఉత్తరాఖండ్ (uttarakhand ) లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ మసీదు, మదర్సా కూల్చివేతతో రణరంగంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బన్ భూల్ పుర ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. వారిని స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు.

Hospital

read also : ఆటోలో అసెంబ్లీకి .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన ..

బన్ భూల్ పుర పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమ కట్టడాలైన మసీదు, మదర్సాను గురువారం కూల్చి వేయడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు పెద్దఎత్తున నిరసనకు దిగడంతో హింస చెలరేగింది. అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు, మున్సిపల్ అధికారులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసు అధికారులు షూటెండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ టైంలో 100 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిలో అధికారులు, పోలీసులు, విలేఖరులు ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.