Read News in Telugu Language
adsdaksha

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదు : కుర్ణవల్లి రోడ్ షో లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 5

కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju ravi chandra ) అన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ( nama nageswararao ), మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ( sandra venkata veerayya ) లతో కలిసి తల్లాడ మండలం కుర్ణవల్లి లో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కాంక్షతో అలవికాని వాగ్ధానాలు చేశారన్నారు. 6గ్యారంటీలు అన్నరు, 420 హామీలిచ్చారు, పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. రైతు భరోసా అంటూ ఇప్పుడున్న 10వేలను 15వేలకు, 2వేల పింఛన్లు 4వేలకు, వరి పంటకు 500బోనస్, కళ్యాణలక్ష్మీ మాత్రమే కాక తులం బంగారం ఇస్తామంటూ ఆశలు పెంచారని విమర్శించారు.
రైతులు, మహిళలు నిజమే కావొచ్చని నమ్మారు, ఇప్పుడు మోసపోయామని తెలుసుకుని బాధ పడుతున్నారన్నారు.

read also : 7న ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక : తుంబూరు దయాకర్ రెడ్డి..

కెసిఆర్ అన్నిరంగాలలో ఉన్నతంగా అభివృద్ధి చేశారని వద్దిరాజు అభిప్రాయపడ్డారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సత్తుపల్లి సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సండ్ర వెంకటవీరయ్య విశేష కృషి చేశారన్నారు. అటువంటి ప్రజా నాయకుడు గెలవకపోవడం దురదృష్టకరమని, వెంకటవీరయ్య మంచి ఓట్ల మెజారిటీతో గెలుస్తారని కేసీఆర్ కి కూడా నమ్మకం ఉండే అన్నారు. బంగారం లాంటి వెంకటవీరయ్య పై మీకు నిజమైన గౌరవాభిమానాలు ఉన్నాయని నిరూపించుకునే సమయం వచ్చిందని అన్నారు.
ఇందుకు గాను మన బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఈ ఎన్నికలలో భారీ ఓట్ల మెజారిటీ తీసుకు రావలసిందిగా మనవి చేశారు.

Hospital

కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు పార్లమెంటులో నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఎంపీలం రాజీ లేని పోరాటాలు చేశామని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీని సాధించుకున్నామని, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను అడ్డుకున్నాం అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అది ఎప్పటికి కూడా జరుగదన్నారు. ఒకవేళ బీ టీమ్ అయినట్టయితే కవితమ్మ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తది .. కేసీఆర్ బస్సు యాత్రపై 48గంటల నిషేధం ఎందుకు పెడ్తారని ప్రశ్నించారు.

read also : భారత రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ మనకొద్దు : సత్తుపల్లి రోడ్ షోలో మంత్రి పొంగులేటి ..

రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలో ముస్లిం,మున్నూరుకాపు,యాదవ, ముదిరాజులకు అవకాశం ఎందుకు ఇవ్వలేదని వద్దిరాజు ప్రశ్నించారు. కాంగ్రెస్ మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ అయిన కూరాకుల నాగభూషణం యాదవ్ డీసీసీబీ చైర్మన్ గా అక్రమంగా తొలగించించారని పేర్కొన్నారు.
ఈ విధంగా కాంగ్రెస్ పాలకులు బీసీలు, ఎస్సీలు,ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం మంజూరుతో పాటు ఏదేనీ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించాలంటే నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.