Read News in Telugu Language
adsdaksha

మున్నూరు కాపులు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటు పడాలి..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 10

సీఎం కేసిఆర్ కి మూడోసారి పట్టం కట్టాలి.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు..

మున్నూరుకాపులందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నసీఎం కేసీఆర్ ( cm kcr ) కి కొండంత అండగా ఉండాలని, మూడోసారి ముఖ్యమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju ravi chandra ) పిలుపునిచ్చారు. తన మనుమరాలు సహశ్రికకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బాసర ( basara )  దివ్య క్షేత్రాన్ని సందర్శించారు.

read also : ఖమ్మం నాఇల్లు.. ఇక్కడి ప్రజలు నాకుటుంబ సభ్యులు..

ఈ సందర్భంగా రవిచంద్ర ఎమ్మెల్యేలతో గంటన్నర పాటు సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కి సంపూర్ణ మద్దతునిద్దామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఈ పదేళ్లలోనే దేశం మొత్తం మీద తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.

Hospital

read also : ట్యాంక్ బండపై చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ..

ఎంపీ వద్దిరాజు మనుమరాలు అక్షరాభ్యాస మహోత్సవం కోసం బాసరకు విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు మున్నూరుకాపు ప్రముఖులు ఆత్మీయ స్వాగతం పలికారు.

బాసరలో మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ ఆకుల లలిత, ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి చేయూతనందిస్తానని మున్నూరుకాపుల హర్షధ్వానాల మధ్య రవిచంద్ర హామీనిచ్చారు.

ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులను మున్నూరుకాపు ప్రముఖులు రోళ్ల రమేష్, తోట రాము, కొట్టే హనుమాండ్లు, కృష్ణ, పెండెప్ కాశీనాథ్, మంద లింగన్న, కోర్వ శ్యాం, ఉదిగిరి హరీష్ పటేల్, కోర్వ సదానందంలు శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం రవిచంద్ర ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని శాలువాతో సత్కరించి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం జరుగనున్న స్థలాన్ని పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.