Read News in Telugu Language
adsdaksha

పెద్దల సభలో రవిచంద్రది క్రియాశీలక పాత్ర : నామా నాగేశ్వరరావు..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 24

రవిచంద్ర పెద్దల సభలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, తెలంగాణ ప్రజల గొంతును బలంగా వినిపిస్తున్నారని లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు అన్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ రాజ్యసభ లోపల, బయట తెలంగాణ ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికి రవిచంద్ర తన వంతు కృషి చేశారని, చేస్తున్నారని కొనియాడారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju ravichandra ) జన్మదినం సందర్భంగా ఖమ్మం బురహాన్ పురంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రవిచంద్రకు పుష్పగుచ్ఛమిచ్చి, శాలువాతో సత్కరించారు. రవిచంద్ర పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా తెలంగాణలో ఫిల్లింగ్, ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకు పాటుపడి ఆ రంగానికి చెందిన వారితో పాటు అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని ఎంపీ నామ ప్రశంసించారు. పుట్టినరోజు వేడుకలు అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరుపుకోవడం సంతోషదాయకమని, రవిచంద్ర ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఎంపీ నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

read also : హార్మోన్ల సమతుల్యత లోపమే అనారోగ్యానికి కారణం.. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ..

Hospital

నామ ఘన విజయానికి కృషి చేస్త: ఎంపీ రవిచంద్ర..

త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. తన పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ నామకు వద్దిరాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కొత్తగూడెం, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఎన్నికల ఇంఛార్జిగా పట్టుదలగా పనిచేసినట్టే, నామ గెలుపునకు పాటుపడుతానని వివరించారు. తామిద్దరిది అన్నదమ్ముల అనుబంధమని, తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడామన్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా కూడా బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ ఉన్నతికి కృషి సల్పుతానని రవిచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్ మాట్లాడుతూ,ఎంపీ రవిచంద్ర సేవాతత్పరతను కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్రలు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.