Read News in Telugu Language
adsdaksha

అందుబాటులో ఉంటూ సేవ చేసే నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించండి : వద్దిరాజు రవిచంద్ర..

దక్ష న్యూస్, సత్తుపల్లి : మే 9

సాయి వెంకట్ మొగుదుంపురం, నెట్ వర్క్ ఇన్ చార్జ్ : దక్ష న్యూస్

ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించే వ్యక్తి, మనందరి హక్కుల సాధనకు కృషి చేసే నామా నాగేశ్వరరావుకు అత్యధిక ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju ravichandra ) అన్నారు. బీఆర్ఎస్ ( brs ) ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ( nama nageswararao ), మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ( sandra venkataveerayya ) లతో కలిసి వద్దిరాజు బుధవారం రోజంతా సత్తుపల్లి నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఈ 5 రోజుల పాటు కష్టించి పని చేద్దాం అన్నారు.

read also : ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం.. రైతులు అధైర్య పడొద్దు : ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ..

Hospital

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేసిన మంచి నాయకుడు సండ్ర వెంకటవీరయ్య అని వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆయన గెలవకపోవడం తీవ్ర విచారకరం కరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫలితాలు వెలువడిన 24 గంటలల్లోనే తన బాధను దిగమింగి ప్రజా సేవలో తిరిగి నిమగ్నమైన గొప్ప నాయకుడు సండ్ర అన్నారు. మేమంతా బలపరిచే గొప్ప నాయకుడు నామాను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

read also : కుల గణన చెయ్యకపోవడం వెనుక కాంగ్రెస్, బిజెపి కుట్ర దాగి ఉంది : కె.పర్వతాలు..

అనంతరం ఎంపీ రవిచంద్ర నియోజకవర్గ కేంద్రం సత్తుపల్లిలోని జలగం నగర్, అంబేడ్కర్ నగర్, గుడిపాడు రోడ్, సిద్ధారం రోడ్డులోని సురేష్ స్కూల్ గ్రౌండ్, శ్రీనివాస టాకీస్ ఏరియాలలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. అలాగే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సత్తుపల్లి మండలంలోని రేజర్ల, సిద్ధారం, రామనగరం, కొత్తూరు, పెనుబల్లి మండలం కొత్తగూడెం రోడ్ వి.ఎం. బంజర లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.