Read News in Telugu Language
adsdaksha

ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 31

– రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర..

కనీవినీ ఎరుగని ఏర్పాట్లతో బిఆర్ఎస్ ( brs ) అభివృద్ధిని కళ్ళకు కట్టేలా ప్రజా ఆశీర్వాద సభ ( praja aseervada sabha ) కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju ravichandra ) తెలిపారు.

బిఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ భారీ ఓట్ల మెజారిటీతో గెలవడం, కేసీఆర్ ( kcr ) హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”లో ఇల్లందు ( yellandu )  నియోజకవర్గ ప్రజలకు సందేశమిచ్చేందుకు విచ్చేస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును హృదయపూర్వకంగా స్వాగిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

Hospital

Read also : సీఎం సభాస్థలిలో మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు..

బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ రవిచంద్ర బుధవారం ఇల్లందులో జరిగే “ప్రజా ఆశీర్వాద సభ”నిర్వహణ, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లందు శివారులోని మోదుగుల గూడెం (బొజ్జాయిగూడెం)సభాస్థలి వద్ద విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి ప్రధాత, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దగ్గర నుండి చూసేందుకు, అద్భుతమైన ఆయన ప్రసంగాన్ని వినేందుకు గాను అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నారన్నారు. ఈ దృష్ట్యా సభకు ఇల్లందు నియోజకవర్గానికి చెందిన సుమారు 80,000మంది స్వచ్చంధంగా హాజరవుతాని ఎంపీ రవిచంద్ర వివరించారు.

 

ఇల్లందు నియోజకవర్గాన్ని 1850 కోట్లతో అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసిన హరిప్రియ భారీ ఓట్ల మెజారిటీతో, బీఆర్ఎస్ 90కి పైగా అసెంబ్లీ సీట్లలో విజయం సాధించడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.