Read News in Telugu Language
adsdaksha

దరిపల్లి కళాశాలలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 15

చంద్రయాన్-3 ( chandrayan – 3 ) ల్యాండింగ్ ఫేస్ చివరి పది నిమిషాల నిడివి సక్సెస్ చేయడం కోసం దాదాపు 30 వేల కమాండ్స్ వాడమని, ఖమ్మం ( khammam ) వాసి, చంద్రయాన్-3 లాండింగ్ స్పేస్ ఆపరేషన్ మేనేజర్ వల్లూరు ఉమామహేశ్వరరావు ( valluru umamaheswararao ) తెలిపారు. నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా ఖమ్మం దరిపల్లి అనంత రాములు ( daripalli anantharamulu ) ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన భారతదేశం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లో అన్ని దేశాల కన్నా ముందుందని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. లాండింగ్ ఫేస్ సమయంలో సారధ్యం వహించిన ముగ్గురు తెలుగువారిలో తాను ఒకడిగా ఉండడం మరచిపోలేని అనుభూతి అని సంతోషం వ్యక్తం చేశారు.

read also : రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య‌ విప్ల‌వం.. వైద్యుల క‌ర్మాగారంగా తెలంగాణ రాష్ట్రం..

దరిపల్లి విద్యా సంస్థల అధినేత ప్రిన్సిపల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య,1861 లో జన్మించారని, భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆయన, మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశారన్నారు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించిందని తెలిపారు. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదును పొందారని, భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారని వివరించారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు విశ్వేశ్వరయ్య ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశారని, హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారని ఈ సందర్భంగా డాక్టర్ దరిపల్లి కిరణ్ తెలియజేశారు.

Hospital

read also : సీఎంపిఎఫ్ సమస్యల పరిష్కారానికి సింగరేణి కృషి..

గెస్ట్ ఆఫ్ హానర్ రిటైర్డ్ పి.ఆర్.డి.ఈ వల్లూరు కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ, సివిల్ ఇంజనీరింగ్ లో 33 సంవత్సరాల అపార అనుభవం, ఎన్నో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి డిజైనింగ్ మరియు ప్లానింగ్ లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవాన్ని వారితో పంచుకున్నారు. ప్రతి విద్యార్థినీ విద్యార్థి మనసుని చదువు మీద లగ్నం చేసి శ్రద్ధతో చదివితే ఉన్నత శిఖరాలని అవిరోధించవచ్చని తెలిపారు. తద్వారా, మీ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

read also : వైద్య విద్యలో నవశకానికి నాంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

అనంతరం ముఖ్యఅతిథి వల్లూరు ఉమామహేశ్వరరావు, గెస్ట్ ఆఫ్ హానర్ గా పద్మావతి – వల్లూరు కోటేశ్వరరావు ఇతర అతిధులను నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్లమా కోఆర్డినేటర్ ప్రభాకర్, బీటెక్ కోఆర్డినేటర్ రమేష్, ఎంబీఏ కోఆర్డినేటర్ ప్రవీణ్, కళాశాల సిబ్బంది ప్రసన్న, సందీప్, వెంకట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.