Read News in Telugu Language
adsdaksha

వందేభారత్ ఆడియో ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర..

దక్ష న్యూస్, హైదరాబాద్, జనవరి 26

ప్రముఖ కళాకారులు, కళారత్న తన ఆత్మీయుడు మల్లం రమేష్ నిర్మించిన “వందేభారత్”  ( vandebharath ) సినిమా ఆడియోను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ ఆవరణలో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన “జై భారత్ జైజై భారత్ జెండా” అనే పాట ఆడియో, వీడియోను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, విద్యాసంస్థల అధినేత లక్కినేని ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, “వందేభారత్” సినీ నిర్మాత, దర్శకుడు మల్లం రమేష్, గాయకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Hospital

Read also: పారిశ్రామికాభివృద్ధి కోసం సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్..

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ దేశభక్తి చిత్రాన్ని నిర్మించాలనేది తన మిత్రుడు మల్లం రమేష్ చిరకాల వాంఛ అని అది సాకారమవడం, దానికి ఆయనే దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కథ విన్నానని ఇంతమంచి సందేశాత్మక చిత్రంలో నటించిన నటీ నటులకు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్లం రమేష్ వద్దిరాజును శాలువాతో సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.