Read News in Telugu Language
adsdaksha

వందేభారత్ ప్రోమో రిలీజ్.. ఇదేం గొడవ భయ్యా.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వేళ..

దక్ష సినిమా న్యూస్, హైదరాబాద్ : జనవరి 15

కళారత్న మల్లం రమేష్ స్వియ దర్శకత్వంలో స్వయంగా నిర్మించిన చిత్రం వందే భారత్ ( సేవ్ ఇండియా ట్యాగ్ లైన్ ). గత 8 నెలలుగా వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తుది మెరుగులు పూర్తి చేసుకొని ఎడిటింగ్ దశ కూడా దాటేసింది. విడుదలకు సిద్దం కాబోతున్న సమయంలో వందేభారత్ ( vandebharath ) చిత్రం నుండి మేకర్స్ ఇటీవల ప్రోమో విడుదల చేశారు. దేశమంతా అయోధ్య ( ayodhya ) రామ మందిర ప్రతిష్టకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న వేళ వందేభారత్ ప్రోమో (promo ), టీజర్స్ ( teasers ) చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటుంన్నారు.

Hospital

read also : మకరజ్యోతి దర్శనం.. పోటెత్తిన భక్త జనం..

వందల ఏళ్ళ తర్వాత హింధూ ముస్లీం భాయి భాయి అని రామ్ లల్లా ( ram lalla ) విగ్రహ ప్రాణప్రతిష్ట కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు చాలా ప్రాంతాల్లో ముస్లీంలు సైతం అయోధ్య అక్షింతల పంపిణీ చేపట్టి ఆదర్శంగా నిలిచారు. దూరతీరాల నుండి అయోధ్యకు వచ్చే భక్తుల కోసం కులమతాలకు అతీతంగా సహాయక చర్యలు, సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో మల్లం రమేష్ ( mallam ramesh ) వందేభారత్ ప్రోమో రిలీజ్ చేయడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ప్రోమోలో మతాల ప్రస్తావన, బాంబు బ్లాస్ట్ల్ లు, కాల్పుల వంటి సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా మేకర్స్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంన్నారో ప్రేక్షకులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే..

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.