Read News in Telugu Language
adsdaksha

ఘనంగా వసంత పంచమి.. కిటకిటలాడిన ఆలయాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 14

వసంత పంచమి పర్వదినం సందర్భంగా బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సరస్వతి మాతా ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ ( nirmal ) జిల్లా బాసర ( basara ) లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ( vasanthapanchami ) వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద వ్యాస మహార్షికి సరస్వతీ దేవికి అభిషేకంతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

read also : భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త .. మేడారం ప్రసాదం హోం డెలివరీ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ..

వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం ఉదయాన్నే భక్తులు క్యూలైన్ లు కట్టారు. అభిషేక సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. మరోవైపు సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు.

Hospital

read aalso : జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ .. సత్తాచాటిన తెలుగు స్టూడెంట్స్..

మరోవైపు ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హోమం, అక్షరభ్యాసాలు నిర్వహించారు. బాసర వెళ్లలేని వారంతా ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయానికి వస్తుంటారని ఆలయ అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.