Read News in Telugu Language
adsdaksha

వాసవీ కన్యకాపరమేశ్వరి శోభా యాత్ర ను ప్రారంభించిన పువ్వాడ దంపతులు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 20

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం ( khammam ) గుట్టల బజార్ లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ( vasavi kanyaka parameswari ) అమ్మవారి దేవాలయంలో శుక్రవారం వాసవీ మాత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులచే నిర్వహించిన సామూహిక కుంకుమార్చనల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) దంపతులు పాల్గొన్నారు.

అనంతరం మేళతాళాలతో విద్యుత్కాంతి దీపాల మధ్య అమ్మవారి శోభా యాత్ర నిర్వహించారు. అశేష భక్తజన సందోహంతో , మాలధారణ వాసవి మాతలతో నగర సంకీర్తన, మహిళల కోలాట ప్రదర్శనలతో బయల్దేరిన అమ్మవారి రధోత్సవ శోబాయాత్ర ను మంత్రి పువ్వాడ ప్రారంభించి సతీ సమేతంగా పాల్గొన్నారు.

Hospital

read also : ప్రచార అనుమతులకు సువిధ పోర్టల్ లో నమోదు చేసుకోండి..

శోభాయాత్రలో మేయర్ పునుకొల్లు నీరజ, పగడాల నాగరాజు, వేములపల్లి వెంకన్న బాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , కోశాధికారి కొత్తమాసు హేమ సుందరరావు , ఉపాధ్యక్షులు గోళ్ళ భాస్కరరావు, బిజ్జల ఈశ్వర్ రావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవరశెట్టి పూర్ణచందర్రావు , మద్ది వెంకట వీరభద్రరావు , సహాయ కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసరావు , అనుమోలు రమేష్ , యర్రమళ్ళ సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.