Read News in Telugu Language
adsdaksha

విద్య వ్యాప్తికి కృషి చేసిన ఆర్.బి.వి.ఆర్.ఆర్ సేవలు ఎల్లవేళలా చిరస్మరణీయం..

- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..

విద్య వ్యాప్తికి కృషి చేసిన ఆర్.బి.వి.ఆర్.ఆర్ (rbvrr) సేవలు ఎల్లవేళల చిరస్మరణీయమని, రెడ్డి కులస్తుల అభ్యున్నతికి రాజ బహద్దూర్ వెంకట రామ రెడ్డి ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( vemula prashanth reddy ) అన్నారు. నిజామాబాద్ ( nijamabad ) జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన రాజ బహద్దూర్ వెంకట రామ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా ( bigala ganesh guptha ) తో కలిసి ఆవిష్కరించారు.

read also : హైదరాబాద్ నగరానికి ధీటుగా ఖమ్మం అభివృద్ధి..

Hospital

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యతోనే వికాసం, అభివృద్ధి సాధ్యమని గుర్తించి, ఎంతో ముందుచూపుతో ఎనభై ఏళ్ల క్రితమే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రెడ్డి హాస్టల్స్, విద్యా సంస్థలు నెలకొల్పారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు విద్యాపరంగా ముందుకు సాగి, ఉన్నత స్థానాలకు చేరేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. తాను కూడా హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ లో ఉంటూ చదువుకున్నానని మంత్రి గుర్తు చేసుకున్నారు. విద్య వ్యాప్తికి కృషి చేసిన ఆర్.బి.వి.ఆర్.ఆర్ సేవలను ఎల్లవేళలా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్డి హాస్టల్స్, విద్యా సంస్థల కోసం మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో 15 ఎకరాల స్థలం, 10 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు.

read also : ఉడిపికి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు..?

ఆర్.బి.వి.ఆర్.ఆర్ సేవలకు జ్ఞాపకార్థంగా ఆయన జయంతి రోజున విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాజ బహద్దూర్ వెంకట రామ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్,నుడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.